Bigg Boss 5 Telugu: ఈ వారం నామినేషన్స్‌‌లో ఉన్నది వీరే !

-

రోజులు గడిస్తున్న కొద్దీ బుల్లి తెర రియాల్టి షో బిగ్‌ బాస్‌ సీజన్‌ – 5 ఆసక్తి కరంగా మారుతోంది. ఇక తాజాగా ఐదో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ సోమ వారం ముగిసింది. ఎప్పటి లాగే… వాదోపవాదాలు, సుదీర్ఘ చర్చల మధ్య నామినేషన్స్‌ ప్రక్రియ ముగిసింది. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని… ఇద్దరు వ్యక్తులను ఎంచుకుని.. తగిన కారణాలు చెప్పి వారి ఫోటోలోని కొంత భాగాన్ని తీసి.. స్విమ్మింగ్‌ పూల్‌ లో పడేయాలని బిగ్‌ బాస్‌ ఆదేశించాడు.

దీంతో బిగ్‌ బాస్‌ లోని సభ్యులంతా… నామినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. అయితే.. ఎప్పటి లాగా ఈ వారం కూడా తొమ్మది మంది హౌస్‌ మెట్స్‌ నామినేషన్‌ లో నిలిచారు. షానూ, సన్నీ, జెస్సీ, యాంకర్‌ రవి, మానస్‌, విశ్వా, హమీదా, లోబో మరియు ప్రియా ఐదో వారం నామినేషన్‌ లో నిలిచారు.

ఇక ఈ వారం చివర్లో… ఈ తొమ్మది మందిలో ఒకరు బిగ్‌ బాస్‌ నుంచి ఎలిమినేట్‌ కాబోతున్నారు. ఇక ఇప్పటి కే నలుగురు ఎలిమినేట్‌ కాగా.. ఈ సారి ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే దానిపై అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. దీనిపై క్లారిటీ రావాలంటే.. మరో ఆరు రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version