కార్తీకదీపం ఎపిసోడ్ 1174: అమెరికా వెళ్లటానికి ఏర్పాట్లు చేయిస్తున్న సౌందర్య..కార్తీక్ డైరీ చదివేస్తున్న హిమ

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో జైల్లో సౌందర్యకు మోనితు మధ్య వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. నా కోసం ఎం తెచ్చారు ఆన్టీ అని మోనిత అడిగి..దీపక్క వచ్చినప్పుడు ఆపిల్స్ తెచ్చింది, మీరేం తెచ్చారు, లడ్డూలు, కజ్జికాయలు ఇలా ఏం తేలేదా అని మాట్లాడుతుంది. ప్రతిదానికి ఒక అందమైన ముగింపు ఉంటుంది. దీనికి కూడా ఉంటుంది అని సౌందర్య అంటుంది.. ఆనంద్ పుట్టబోయే నా బిడ్డతోనే ఈ కథకు ముగింపు..ఇంత కంటే ఎక్కువ ఏముంటుంది అని మోనిత అంటుంది. జైలుశిక్షపడిందిగా అనుభవించు అని సౌందర్య అంటుంది. ఇక్కడ నుండే నా కార్యచరణకు శ్రీకారం చుట్టాను, పేపర్లో ఆర్టికల్ చదివే ఉంటారుగా అని మోనిత అంటుంది.

నువ్వేంటో, నీ ఆలోచనలేంటో నాకు అన్నీ తెలుసు, పేరోల్ మీద రావటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నావ్ గా, నువ్వొస్తానంటే నేను రానిస్తానా అంటుంది సౌందర్య. మోనితకు దిమ్మతిరుగుతుంది. సౌందర్య ఏంటి షాక్ అయ్యావా, నీకు ఇకనుంచి అన్నీ షాక్ లే, పాతకేసులన్నీ తోడిస్తాను, నిన్ను ఈ జైలు నుంచి బయటకురానివ్వను, ఈ జైలుజీవితమే నీకు గతిఅయ్యేలా చేస్తాను అంటూ మాట్లాడుతుంది. మోనిత ఆన్టీగారు నా కడుపులో బిడ్డ పుట్టగానే నో గొడవలు అన్ని హక్కులు వస్తాయ్ అంటుంది. సౌందర్య దానికి గట్టి సమాధానమే ఇస్తుంది. శిశుపాలిడితో మోనితను పోలుస్తుంది సౌందర్య. నేను శ్రీకృష్ణుడితో పోలుస్తున్నాను, జైల్లో పుట్టి బుజ్జిబుజ్జి అడుగులు వేసుకుంటూ మీ ఇంటికొస్తాడు అని చెప్తుంది మోనిత. నా కొడుకుని ఒళ్లో పెట్టుకుని పెళ్లిపీఠలమీద కుర్చుంటాను, ప్రామిస్ అత్తయ్యగారు అంటుంది. సౌందర్య నవ్వుతూ..నీ కలలు పగటికలలు కాబోతున్నాయ్, మా వాళ్లను అమెరికా పంపిస్తునాను. నువ్వు వెళ్లలేవు, నువ్వు ఆర్టిఫిషీయల్ ఇన్స్మునేషన్ ద్వారా బిడ్డను కన్నావ్ అని నేను నిరుపిస్తాను. నువ్వు పేపర్ మాత్రమే వాడావ్, నేను పేపర్, మీడియా అన్ని ఛానల్లను వాడుకుంటాను అంటుంది. ఇలా కౌంటర్లు ఇస్తూ..ఆరోగ్యం జాగ్రత్త..అసలే నీది ఆర్టీఫీషియల్ గర్బం, జరగనిదాన్ని ఊహించకు ఆరోగ్యంపాడవుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది. మోనితకు దెబ్బకి చెమటలుపడతాయ్.

ఇంట్లో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆదిత్య అన్నయ్యా అని అరుచుకుంటూ వస్తాడు. ఆదిత్య ప్లీస్ మళ్లీ యూఎస్ టాపిక్ తీయకు అంటాడు కార్తీక్. ఆనంద్ రావు వచ్చి అరే సౌందర్య ఏది అంటాడు. ఆదిత్య మమ్మీ ఆ మోనితను కలవటానికి వెళ్లింది అంటాడు. అంతే కార్తీక్ కి చిర్రెత్తిపోతుంది. ఎందుకు వెళ్లింది అని అరుస్తూఉంటాడు. ఇంతలో హిమ, శౌర్యలు వస్తారు. దీప పిల్లలు అనేసరికి కార్తీక్ ఏం మాట్లాడడు. ఏంటి ఏం జరుగుతుంది, మేం రాగానే ఆపేశారేంటి అని శౌర్య అంటుంది. అంటే మనకి తెలియని విషయాలు మాట్లాడుకుంటున్నారేమో శౌర్య అని హిమ అంటుంది. ఆదిత్య సీరియస్ గా నోర్ మూయండి, పిల్లలు పిల్లల్లా ఉండాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి, మీ ఏజ్ ఏంటి వీళ్ల మాటలేంటి అంటాడు. కార్తీక్ ఆగు అంటాడు. దీప కూడా తిడుతుంది. ఈ పిల్లలకి ఇంత ఓవర్ యాక్షన్ కార్తీక్ వల్లే వచ్చిదనిపిస్తుంది. అందరూ తిడుతున్నా కార్తీక్ మాత్రం ఆదిత్య ఇప్పటిదాక జరిగిన పొరపాటును నేనే సరిదిద్దుకుంటాను, నా సమస్యకు నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పు వాళ్లకి అని చెప్పి వెళ్లిపోతాడు. దీప డాక్టర్ బాబు అని పిలుస్తుంది. ఏటు వెళ్తున్నారు అని అడిగితే..నేనేం చచ్చిపోనూ దీప, అంత పిరికివాడ్ని కాదు అంటాడు కార్తీక్. ఆనందర్ రావు ఏంట్రా ఆ మాటలు అంటే..నేను ఈ ఇంటిపరువు నిలబెట్టటానికి ఎంత కష్టపడుతున్నానో ఎవరికి తెలియదు అంటాడు.

కట్ చేస్తే జైల్లో మోనిత, సౌందర్య అన్న మాటలను తలుచుకుని తెగ కంగారు పడుతుంది. వాళ్లు అమెరికా వెళ్లిపోతే..నేనేం కావాలి, నా కొడుకేం కావాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి, ఏం చేస్తే అమెరికా ప్రయాణం ఆగిపోతుంది అనుకుని కార్తీక్ ఫొటో తీసుకుని పర్సనల్ గా నువ్వు టెన్షన్ పడటం నాకు ఇష్టంలేదు, కానీ నీ కోసం, మన బాబుకోసం యుద్దం చేయక తప్పుదు అని నవ్వుతుంది. అంటే మళ్లి ఏదో ప్లాన్ వేసినట్లుంది.

ఇటువైపు ఇంట్లో ఆనంద్ రావు ఎందుకు జైలుకివెళ్లావ్ అని సౌందర్యను అడుగుతాడు. అలా వాళ్లు మాట్లాడుకుంటారు. దానికి నెలలు నిండకముందే మనవాళ్లను సముద్రాలు దాటించేయాలి అని ఆదిత్యను పిలుస్తుంది. దీప, శౌర్య, ఆదిత్య వస్తారు. నానమ్మా అంటూ ఏదో చెప్పబోతుంది. సౌందర్య సీరియస్ గా నేనిక్కడ ఎవ్వరి అభిప్రాయాలు అడగటం లేదు. ఆదిత్య పెద్దోడి ఫ్యామిలీ అందరికి వీసాలు రెడీ చేయించు అంటుంది సౌందర్య. ఆదిత్య ఏమైంది మమ్మీ ఇంత సడన్ గా, మమ్మీ వెళ్లమని నేను అన్నాను, కానీ ఇప్పటికి ఇప్పుడు అంటే అవ్వదు అంటాడు. ఇప్పుడు స్టాట్ చేస్తే ఎప్పటికైనా అవుతుందిగా అడుగుతుంది. రెండునెలలు టైం పడుతుంది అంటాడు ఆదిత్య. ఇలా అమెరికా ప్రయాణం గురించి ప్రాసెసింగ్ గురించి మాట్లాడుకుంటారు. శౌర్య వచ్చి నానమ్మా మేం అమెరికా వెళ్లమ్, ఇక్కడే ఉంటాం అంటుంది. సౌందర్య ఫుల్ పైర్లో ఇక్కడే ఉండి ఏం చేస్తారు, పెద్దాచిన్నా తేడాలేకుండా మాట్లాడతారు, కడుపునపుట్టినపాపాకిని వాడ్ని పీక్కుతింటున్నారు అవసరమా ఇవన్నీ వాడికి అని..మీరంతా అమెరికా వెళ్తున్నారు అంతే అంటుంది. శౌర్య చిరాగ్గా వెళ్లిపోతుంది. వెళ్లనివ్వు, వాళ్లని ఎందుకు ఆపుతావు, ఇప్పటిదాక బయపడింది చాలు దీప, ఆదిత్య నువ్వు పనిమొదలుపెట్టు, ఇదే ఫైనల్, పెద్దోడికి నేను చెప్తాను అని వెళ్లిపోతుంది.

తరువాయిభాగంలో హిమ ర్యాక్ సర్దుకుంటూ ఉండగా కార్తీక్ డైరీ కిందపడుతుంది. ఎవరిది అనుకుని హిమ చదువుతుంది. అందులో విహారి ప్రస్తావన ఉంటుంది. ఈ పిల్ల ఏం చూసిందో తెలియదు కానీ గట్టిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version