కార్తీకదీపం ఎపిసోడ్ 1185: ల్యాబ్ లోంచి వారణాసికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయిన దీప..కన్నతండ్రికి గండం అంటూ పెద్దస్కెచ్ వేసిన మోనిత

-

 కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య ఆనంద్ రావు దీప ఎక్కడికి వెళ్లుంటుంది అనుకుంటారు. సెల్ ఫోన్ మర్చిపోయిందా, లేక కావాలనే తీసుకెళ్లలేదా అని ఆనంద్ రావు అంటాడు. ఏమోనండి రాత్రంతా నిద్రపోలేదంట పిల్లలు చెప్తున్నారు అని సౌందర్య అంటుంది. ఆనంద్ రావు ఈ ఇంటికి ఏదో పట్టుకుంది అని కోపంగా అరుచుకుంటూ వెళ్లిపోతాడు. ప్రియమణి వస్తుంది. ఏంటి ఇక్కడ నిలబడ్డావ్ అంటే..నాకు మోనితమ్మ ఫోన్ చేసిందమ్మా అంటుంది. సౌందర్య కోపంగా మోనిత నీకు ఫోన్ చేసిందా, ఏం చెప్పిందే అంటే..ప్రియమణి అంతా చెప్పింది, మగబిడ్డపుట్టాడు అంటకదా, కార్తీకయ్యే వెళ్లి సంతకం చేస్తాడంటకదా అంటాడు. సౌందర్య నోర్ మూయ్, చిన్నగా మాట్లాడు, దీపకు ఈ విషయం చెప్పలేదు కదా అంటే..ప్రియమణి చెప్పలేదు అంటుంది. ప్రియమణి పుట్టిన బిడ్డ పేగుమెడకేసుకుని పుట్టాడు కదమ్మా..అలా పుడితే మేనమావలకు, కన్నతండ్రికి గండం అంటారు. మేమమావలు ఎవరూ లేనట్లు ఉన్నారు..ఇంక కన్నతండ్రి అంటే కార్తీకయ్యే కదమ్మా, అయినా మీకు ఇవన్నీ చెప్పాలా అని వెళ్లిపోతుంది. సౌందర్య ఈ విషయం నేను విన్నాను అనుకుంటుంది.
karthika-deepamప్రియమణి వచ్చి జరిగింది అంతా మోనితకు ఫోన్ చేసి చెప్తుంది. దీప కనిపించటం లేదు అని ఫీల్ అవుతున్నారు అని ప్రియమణి చెప్తుంది. ఎక్కడికి పోతుందిలే..ఏదో మూల కుర్చునే ఉంటుంది అంటుంది. నాకు భయంగా ఉంది అని ప్రియమణి అంటే..ఇప్పటినుంచి భయపడాల్సింది మనంకాదు ప్రియమణి..నేను ఇక్కడ కుర్చునే నా కార్యకలాపాలు సాగిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అంటుంది. ఫోన్ కట్ చేసి..నేను ఇక్కడ కుర్చూనే వాళ్లను కంట్రోల్ చేస్తాను..నేను కూర్చోమంటే కుర్చుంటారు, నుల్చోమంటే నుల్చుంటారు. రిమోట్ నా చేతులో ఉంది అనుకుంటుంది. అసలు ఈ మోనిత మళ్లీ ఏం ప్లాన్ వేసిందో..ఇంకోపక్క దీప ల్యాబ్ లో ఉంటుది. పల్లవి వచ్చి దీపను ల్యాబ్ ఓనర్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఆ ల్యాబ్ ఓనర్ పల్లవితో నేను చెప్పేవరకూ ఎవర్ని రానియ్యకు అంటాడు. దీపతో అతను ఆ శాంపిల్ ఎవరికి ఇవ్వలేదు అంటాడు. రాకపోతే ఆ శాంపిల్ వేరేవాళ్లకు ఇచ్చేస్తారా అని దీప అరుస్తుంది. ఆ ఓనర్ మాత్రం టెస్ట్ చేయించుకున్నారు కానీ, రిపోర్ట్ మాత్రం ఇంతకవరకూ తీసుకెళ్లలేదు అని రిపోర్ట్ ఇస్తాడు. దీప నేను రిపోర్ట్స్ కోసం రాలేదు..శాంపిల్ మోనితకు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలని వచ్చాను అంటుంది. మేము శాంపిల్ ఎవరకి ఇవ్వలేదు, ఆ మోనిత ఎవరో మాకు ఎవరికి తెలియదు మేడమ్ అంటాడు. దీప ఆలోచనలో పడుతుంది. గతంలో కార్తీక్ దీప కాళ్లు పట్టుకుని నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప అనే సీన్ తలుచుకుని ఏ తప్పు గురించి మాట్లాడాడు అనుకుంటుంది. దీప లేచి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోతుంది.
ఇంట్లో కార్తీక్ దీప ఎక్కడికి వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. శౌర్య వచ్చి ఎందుకు అలా ఉన్నావ్, అమ్మ బయటకు వెళ్లిందనా, అని కార్తీక్ చేయి పట్టుకుని..మేం నీతో బానే మాట్లాడుతున్నాం కదా, నువ్వు అమ్మా ఎందుకు డల్ గా ఉంటున్నారు, అమ్మ కూడా నీలాగే ఉంటుంది, ఏం మాట్లాడదు, భయమేస్తుంది, అందరం కలిసిపోయాం కదా, హ్యాపీగా నవ్వుతూ ఉండొచ్చుగా, నువ్వు నవ్వితే బాగుంటావ్ నాన్న అంటుంది. సర్లే అమ్మా అంటాడు. నువ్వు నన్ను కొత్తగా పిలుస్తున్నావ్, అమ్మా అమ్మా అంటూ..నువ్వు నన్ను రౌడీ అంటేనే ఇష్టం నాన్న అంటుంది. కార్తక్ శౌర్యను ముద్దుపెట్టుకుని..నేను ఎంత రాక్షసంగా ప్రవర్తించాను అని దీపకు గతంలో చేసిన అన్యాయం గురించి ఆలోచిస్తాడు. పక్కనే ఉన్న శౌర్య సోదిప్రశ్నలు వేస్తూ సీన్ ల్యాగ్ చేస్తుంది.
ఇంకోసీన్ లో వారణాసి ల్యాబ్ లోకి వస్తాడు. దీపవెళ్లిపోయిందని లోపల ఉన్న పల్లవి చెప్తుంది. వారణాసి నేను బయటే ఉన్నాను కదా, ఎప్పుడు వెళ్లింది..అక్కకు ఏమైనా అయిందా అనుకుంటాడు. మరోపక్క భారతి మోనిత మాట్లాడుకుంటారు. మోనిత తన కొడుకుకి బారసాల చేయిస్తాను అంటుంది. భారతి బిత్తరిమొఖం ఏసుకుని బారసాల ఎలా చేస్తావ్, సాధ్యమయ్యేపనేనా అంటుంది. మోనిత సాధ్యమవుతుంది..వీడు లీగల్ పీస్, చట్టబద్దంగానే పెంచుతాను అంటుంది. భారతి దూకుడుగా వెళ్లొద్దంటూ ఉచితసలహాలు ఇస్తుంది. అయినా ఈ మోనిత వినదు..నువ్వునాకు ఆశ్రయం ఇచ్చావని జ్ఞానభోదచేయాలని చూడకు అంటుంది. నేను అన్నీ ప్లాన్ చేసి పెట్టాను, రేపు మా అత్తయ్యగారు గుడికి వెళ్లి శాంతి పూజచేయిస్తారు, అది నాకు తొలివిజయం అవుతుంది. చూస్తూ ఉండూ అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version