Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నయా లుక్‌లో అభిమానులను భయపెడుతున్నాడు. చిరంజీవి భయపెట్టమేంటి అనుకుంటున్నారా? అవునండీ బాబు.. ఎప్పుడూ నవ్వుతూ కూల్‌గా కనిపించే చిరు లుక్ ను చూసి పిల్లలు జడుసుకుంటారు. తాజాగా చిరు దెయ్యం లుక్ చూసి ఫ్యాన్స్ చాలా థ్రిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే .. తాజాగా చిరంజీవి ఏదీ హారర్ సినిమాలో నటించబోతున్నారా? ఎందుకలా ఆయన దెయ్యం లుక్‌లో కనపడుతున్నారనే డౌట్ వచ్చే ఉంటుంది. ఆ లుక్ ఏదైనా మూవీకి కోసం అని భావిస్తే.. మీరు పప్పులో కాలేసినట్టే..
వివరాల్లోకెళ్తే.. అక్టోబర్ 31న హలోవీన్ డే. ఈ సందర్బంగా పలువురు సెలబ్రిటీలు హాలోవీన్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందులో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగానే చిరు కూడా దెయ్యం లుక్‌లో ఉన్న తన సరదా వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసి.. ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ‘హ్యాపీ హలోవీన్’ అంటూ విషెస్ తెలిపారు. ఎగ్జయిట్‌మెంట్ డే అని క్యాప్షన్ తో ఓ వీడియోను పోస్ట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఆయన ఈ లుక్ కోసం మేకప్ వేసుకోలేదు. జస్ట్ ఓ యాప్ ఉపయోగించి వీడియో చేశారు. ఇప్పుడూ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
చిరు తన కెరీర్ ప్రారంభంలో దొంగ సినిమా లో ‘గోలీమార్.. కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తారో.. ’ అనే పాటలో దెయ్యం గెటప్ లో భయపెట్టిన విషయం తెలిసిందే. మైకేల్ జాక్సన్ ఆల్బమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సాంగ్ ను కంపోజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత మరోసారి చిరంజీవి దెయ్యం లుక్‌లో మళ్లీ కనిపించారు.
ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్‌ను పూర్తి అయింది. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానునంది. మరోవైపు గాడ్‌ఫాదర్ సినిమా షూటింగులో ఆయన బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తి కాగానే.. భోళా శంకర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిరంజీవి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా నవంబర్ 11న లాంఛనంగా ప్రారంభమై, నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.