కార్తీకదీపం ఎపిసోడ్ 1240: తాడికొండకు చేరిన సౌందర్య పంపించిన బిచ్చగాడు మహేష్..దీపమ్మ జాగ్రత్త అంటూ కార్తీక్ ను బెదిరించిన రుద్రాణి

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఇంటికి వెళ్తుంది రుద్రాణి. ఇంట్లో బాబుకి పాలు కలుపుతున్న కార్తీక్ తో ఏంటి సారు ఏం చేస్తున్నారు..రంగరాజుకి పాలు కలుపుతున్నారా..అరెరే..ఏంటి ఈ పనులు సార్..ఈ ఇంట్లో ఆడమనిషి..ఊళ్లోకి వెళ్లి పిండివంటలు అమ్ముతుందా..నువ్వేమే ఇంట్లో కుర్చోని ఇలాంటి పనలుు చేస్తున్నావా..ఛీ ఛీ.. మొగుడు పెళ్లాం అయితే..పెళ్లాం మొగుడైంది అని కార్తీక్ ను రెచ్చగొడుతుంది. ఆపు అని అరుస్తాడు కార్తీక్. పనీ పాటా చేతకాని వాళ్లకి కోపం ఎక్కువ అని రుద్రాణి… అవును మా రంగరాజు ఎలా ఉన్నాడంటూ బాబుని ఉద్దేశించి అంటుంది. బాబు దగ్గరకు రావొద్దని కార్తీక్ అంటాడు. మీకు ఇద్దరు పిల్లలున్నారు కదా బాబుని నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. బాబు మా దగ్గరే ఉంటాడు అంటాడు కార్తీక్.. నువ్వు ఇంట్లో బాబుని బాగానే ఆడిస్తావ్ కానీ..బయటకు వెళ్లిన నీ పెళ్లాం దీప, పిల్లలు క్షేమంగా రావాలి కదా అంటుంది రుద్రాణి. కార్తీక్ కంగారుపడతాడు.. రోజులు అస్సలు బాగాలేవు అంటూనే.. శ్రీవల్లీ కోటేష్ ఫోటే చూసి..పాపం ఉత్తపుణ్యానికే చనిపోయారు., సారు రంగరాజును ఇమ్మంటే ఇవ్వడం లేదు..కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించండి.. ఎవరి టైం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు..ముందు జాగ్రత్తగా చెప్పానంటూ బెదిరించి వెళ్లిపోతుంది.

మోనిత ప్రజావైద్యశాల

సౌందర్య ఇంట్లోంచి విసిరిపడేసిన ఫొటోని ప్రజావైద్యశాలలో పెట్టిన మోనిత ..కార్తీక్ ఎంత బావున్నావ్ అనుకుంటూ ఉయ్యాల్లో ఉన్న బాబు బొమ్మతో మాట్లాడుతుంది. ఇది పిచ్చి అనాలో..ఇంకేమనాలో..బాబుని ఎవడు కిడ్నాప్ చేశాడు అని వెళ్లి ఆ పని చేయకుండా బొమ్మతో కబుర్లు ఏంట్రా బాబు.. ఇంతలో అక్కడకు వచ్చిన నరసమ్మతో మోనిత మా జోడి బాగుంది కదా అంటూ చెప్పుకొస్తుంది. సార్ ఎక్కడికి వెళ్లారు మేడం అని అడుగుతుంది. ముంబై వెళ్లాడని చెప్పిన మోనితతో. ఏంటి నమ్మనట్లు చూస్తున్నావ్ అంటే..నర్సమ్మ..మీ గురించి నాకు మొత్తం తెలుసు మేడమ్ అంటుంది..మీ ప్రేమకథ మొత్తం నాకు తెలుసు అంటుంది. అయితే ఇంకేం నో ప్రాబ్లెమ్ అంటుంది. వస్తారు అనే నమ్మకం ఉందా అంటే..మోనిత కోప్పడుతుంది.

కట్ చేస్తే కార్తీక్ ని వెతకమని సౌందర్య బిచ్చగాడికి డబ్బులిస్తుంది. ఆ బిచ్చగాడు వెతుకుతూ తాడికొండ గ్రామానికి వెళతాడు. నేరుగా వెళ్లి రుద్రాణి మనిషి దగ్గరకు వెళ్తాడు. వాడు ఫోనులో బిజీగా ఉంటాడు..కార్తీక్ ఫొటో చూపించి ఈయన మీకు తెలుసా అని అడుగుతాడు. వాడు ఫోను చూడకుండానే..వెళ్లిపోతాడు.

ఇంట్లో బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టిన కార్తీక్..దీప-పిల్లలు క్షేమంగా రావాలి కదా అన్న రుద్రాణి మాటలు గుర్తుచేసుకుంటూ దీప ఇంకా ఇంటికి రాలేదంటని ఆలోచిస్తాడు. కార్తీక్ లో భయం మొదలైంది. దీప గురించి ఆలోంచి..దీప ఇంకా రాలేదేంటి అనుకుంటాడు. రుద్రాణి ఎందుకు అలా అంది..పిల్లల దగ్గరకు వెళ్లాలి అని అటు చూస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మహాలక్ష్మి అనే మహిళ దీప లేదా అని అడుగుతుంది. నేను స్కూల్ వరకూ వెళ్లిరావాలి బాబుని చూస్తావా అని ఆమెకి అప్పగించి కార్తీక్ స్కూల్ కివెళతాడు.

స్కూల్లో కూర్చున్న పిల్లలు అమ్మ ఇంకా రాలేదేంటి ఆకలి వేస్తోంది అనుకుంటారు. ఇంతలో అక్కడకు క్యారియర్ తీసుకుని వస్తుంది రుద్రాణి. పిల్లలు రుద్రాణిని చూసి భయపడతారు. అప్పుడు పండ్లు, చాక్లెట్లు ఇచ్చాకదా అనగానే.. అవి మేం తినలేదు వేరేవాళ్లకి ఇచ్చేశాం అంటారు పిల్లలు. అప్పుడు ఇచ్చి వెళ్లాను..ఇప్పుడు తినిపించే వెళతా అంటుంది రుద్రాణి. ముద్దలకు కలిపి పెడుతుంటే..హిమ నేను తినను అంటుంది.
శౌర్య.. మీరెవరు మాకు లంచ్ తేవడానికి, మేం ఎందుకు తినాలి అంటుంది.. మా అమ్మ తీసుకొస్తుంది వెళ్లండి అంటుంది. మీకు ఆకలి వేస్తోందని నాకు తెలుసు తినండని చెప్పినా చేయి విసిరి కొడుతుంది శౌర్య. ప్రేమగా అన్నం తినిపిస్తుంటే వద్దంటారేంటి అంటూ తినిపించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడకు వెళతాడు కార్తీక్. అన్నం తినమని అరుస్తుందని చెబుతారు పిల్లలు. దీంతో కార్తీక్..మనుషులా రాక్షసులా..పిల్లల్ని బెదిరిస్తారా అంటూ ఫైర్ అవుతాడు. నేను బెదిరించానా అంటే.. కార్తీక్ మీకు కొంచెం కూడా జ్ఞానం లేదా అని పిల్లలను పంపిస్తాడు. మీ ఉద్దేశం ఏంటి..మా పిల్లలకు నువ్వు భోజనం ఏంటి అంటాడు. రుద్రాణి..మళ్లీ అదే బెదిరింపు డైలాగ్స్ వేస్తుంది.
నేను ఏదో అన్నానని భయపడి వచ్చావా..పిల్లలంటే నాకు ఇష్టం వాళ్లని ఏమీ చేయను అంటూనే..దీపమ్మ ఇంటికి వచ్చిందా…ఏంటి రాలేదా.. మరి ఎక్కడుందో వెతుక్కోవా అంటుంది. నా చెంప మీద చాచి కొట్టింది, వెళ్లి వెతుక్కో అంటుంది. రుద్రాణి వెళ్తూ..మళ్లీ దీపమ్మను వెతుక్కోవా అని బెదిరించి వెళ్తుంది.

మరోవైపు తాడికొండ చేరిన బిచ్చగాడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అటు కార్తీక్..దీపను వెతుకుతూ తిరుగుతాడు. దీప ఎక్కడకు వెళ్లింది, రుద్రాణి అలా ఎందుకు అంది అనుకుంటాడు. మహేష్ ఊర్లో అందరికి కార్తీక్ ఫొటో చూపించి అడుగుతాడు. కార్తీక్ దీప గురించి ఎవర్ని అడగాలి…శ్రీవల్లి-కోటేష్ ల విషయంలో దీపకి ఏం కాకూడదని కోరుకుంటాడు. ఇంతలో కార్తీక్ ఎదురుగా వస్తాడు కానీ.. అప్పుడే వేరే వ్యక్తి టోపీ కిందపడడంతో ఆ మహేష్.. కిందకు వంగుతాడు..కార్తీక్ క్రాస్ అయి వెళ్లిపోతాడు. సీరియల్స్ లో ఇలాంటివి కామన్ హా గే..హైప్ ఇచ్చి డౌన్ చేసేస్తారు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో..ఈ మహేష్ కార్తీక్ వాళ్లను కనిపెడతాడో లేదో చూడాలి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version