కార్తీకదీపం ఎపిసోడ్ 1165: సుకన్యతో మరోప్లాన్ వేసిన మోనిత..ఇక దీపఇంట్లో ఏం జరిగిన మోనితకు లైవ్ టెలికాస్ట్ అ‌వుతుందట..!

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ శౌర్యతో డాడీ గుడ్ బాయ్ ఏం కాదు అని చెప్పి, మోనితను పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్తుంది. శౌర్య అలా ఎలా చేసుకుంటా అంటాడు అంటుంది. ఇద్దరు కార్తీక్ గురించి మాట్లాడుకుంటారు. హిమ ఏమో డాడీ అనటం తప్పు అని శౌర్య.. మనల్ని వెతికిస్తే చేసుకుంటా అని ఉంటాడులే అంటుంది. అందరూ అబద్ధాలు చెప్పి మనల్ని చెప్పి చీట్ చేస్తున్నారు శౌర్య అని హిమ ఏడుస్తుంది. శౌర్యకు ఏం అర్థంకాదు. నాన్న మోనిత ఆన్టీతో మాట్లాడాడు అంటే హిమ చెప్పినట్లు నాన్న నిజంగానే బాడ్ బాయ్ హా అనుకుంటుంది. ఇంకోసీన్ లో దీప దిగాలుగా నడుచుకుంటూ వస్తుంది. సౌందర్య పిలిచి ఏంటే ఈ చీరేంటీ, పూలేవి, నీకు మంచి మంచి చీరలు కొనిపెట్టాను, నగలు చేయించాను ఏవి వేసుకోవేంటే అంటుంది. దీప వైరాగ్యం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఏమైంది నీకు అచ్చం వంటలక్కలా మాట్లాడుతున్నావ్ అంటుంది. దీప ఆ వంటలక్క పాత్రే బాగుంది అత్తయ్య, పరువు బజారునపడిన పట్టుబట్టలు కట్టుకుని గంభీరంగా ఉన్నట్లు నటించలేకపోతున్నాను అంటుంది. ఇలా ఇద్దరు దిగాలుగా కార్తీక్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటారు. ఓ రకంగా ఇది లాగ్ సీన్ లాంటిది.

ఇటువైపు కార్తీక్ క్యాబిన్ కి డాక్టర్ భారతి వస్తుంది. అసలు ఈ భారతి మంచిదా చెడ్డదో అర్థంకాదు. కార్తీక్ మోనిత విషయంలో ఏం చేయాలో నాకు అర్థంకావటంలేదు, ఓ సారి నా వైపు నుంచి ఆలోచించు, నా తప్పు ఏముంది అని భారతీతో అంటాడు. భారతి తప్పుఒప్పులు గురించి మాట్లాడుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయావ్. నువ్వే మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి అంటుంది. నువ్వు కూడా అలాఅంటావేంటి అంటాడు. రేపు నా బర్డే జైలు నుంచి ఇక్కడకు వచ్చింది, రేపు ఇంటికి కూడా వస్తుందేమో అని భయమోస్తుంది అంటాడు. అయినా డాక్టర్ బాబు ఎప్పుడూ మేకవన్నె పులినే నమ్ముతాండేంటో..అప్పుడు మోనిత ఇప్పుడు భారతి. ఈ పరిస్థితిలో నేను ఆపరేషన్ చేయలేను నువ్వే చెయ్ నేను హెల్ప్ చేస్తా అంటాడు.

ఆరోజు రాత్రి మోనిత చేతిలో కార్తీక్ ఫుటో ఉంటుంది. ఎవరో ఆర్టిస్ట్ గీసి ఇచ్చిందట. అది చూసి ఓ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో సుకన్య వస్తుంది. బొమ్మ చాలా బాగా గిశారు..ఎ‌వరు సుకన్య గీసింది, ఇంత మంచి ఆర్టిస్ట్ జైలుకి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. దానికో పిట్టకథ చెప్తుంది సుకన్య..మంచి కళాకారణి మేడమ్, మొగుడు తన కళను తొక్కేసి రెండో భార్యను తెచ్చుకున్నాడంట..ఆ మోసం భరించలేక అంతే కోపంతో చంపేసింది అంటుంది. మోనిత అంటే నా కార్తీక్ కి కూడా పెళ్లైందికదా..నేను చేసేది కూడా మోసమా అనుకుంటుంది. సుకన్యతో నువ్వెళ్లు సుకన్య నేను నా ఆత్మతో ఆత్మపరిశీలన చేసుకోవాలి అంటుంది. తనకు తానే సమర్థించుకుంటుంది. నేనే కార్తీక్ కి ఆత్మబంధువులా ఆత్మపెళ్లాన్ని నా ప్రేమను త్వరలోనే అర్థంచేసుకుంటావ్, అర్థమయ్యేలా చేస్తాను అంటుంది.

ఇంట్లో ఆనంద్ రావు ఫోనులో మాట్లాడుతూ ఉంటాడు. సౌందర్య టాబ్ లెట్ తీసుకుని వచ్చి ఏమైంది అండి అంటుంది. జైలు సూపరింటెండెంట్ ఫోన్ చేశాడు..ఆ మోనిత జైలు గోడలనిండా నా కార్తీక్ అని రాసుకుంది అంట. అసలు ఆ పేపర్ లో వేసినప్పటినుంచి తెలిసిన వాళ్లు తెలియని వాళ్లు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. మోన్న నా ఫ్రెండ్ అయితే..నీకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కోడల్లు అన్నాడు, తలతీసేసినట్లైంది అంటాడు. సౌందర్య అందరికి చెప్పినట్లే ఆనంద్ రావుకి కూడా ధైర్యం చెప్తుంది. జైల్లో ఉన్నదాని గురించి ఎక్కువ ఆలోచించకండి, ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ఆలోచించండి, పరిస్థితులు త్వలోనే సర్థకుంటాయ్ అని చెప్పి వెళ్లిపోతుంది.

మరుసటిరోజు ఉదయం..మోనిత బయట ఉంటే సుకన్య టిఫెన్ తెచ్చి ఇస్తుంది. టిఫెన్ ఎ‌వరు చేశారో కాని అద్దిరిపోయింది అంటుంది మోనిత. నేను చెప్పే న్యూస్ కూడా ఈ ఉప్మాలానే అద్దిరిపోతుంది మేడమ్ అంటుంది. ఏంటో చెప్పు చెప్పు అంటుంది. మీరు చెప్పిన పని చేసేసా, చేస్తా అన్నాడు అంటుంది. అసలు ఈ మోనిత ఏం చెప్పిందో..ఆ సుకన్య ఏం చేసిందో మనకి చెప్పరు. మోనిత థ్యాంకూ సుకన్య అని దీప ఇక నుంచి నీ ప్రతికదలిక నాకు లైవ్ టెలికాస్ట్ లాగా తెలిసిపోతుంది అనుకుంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగా..సుకన్య ఇంకో చిన్న హెల్ప్ చేయాలి అని సుకన్య చెవిలో మోనిత ఏదో చెప్తుంది. సుకన్యకు మనసులో మళ్లీ ఏం ఫిటింగ్ పెడుతుందో అనుకుంటుంది. సో ఈరోజు నుండి దీపక్క ఇంట్లో ఏం జరుగుతుందో నాకు పూసగుచ్చినట్లు తెలిసిపోతుందనమాట అని మోనిత అనుకుంటుంది.

ఇంకోవైపు దీప గుడికి వెళ్లివస్తూ ఉంటుంది. మోనితగురించి తలుచుకుని రోషిణి మేడమ్ ని కలవాలి, ఆ మోనిత చేసిన నేరాలన్నీ చెప్పాలి. అది జీవితాంతం జైల్లో ఉంటేకాని మాకు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ ఉంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version