ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ లో 1990ల్లో పండిట్ల ఊచకోత, హిందువులపై అత్యాచారాలు, కాశ్మీర్ లో స్థానికులుగా ఉన్న చాలా మంది పండిట్లు వేరే ప్రాంతాలకు వలసవెళ్లడం, ఆనాటి ప్రభుత్వాల ఎలా వ్యవహరించాయి వంటి అంశాలతో కాశ్మీర్ ఫైల్స్ సినిమా రూపొందింది. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంటర్టైన్మెంట్ టాక్స్ మినిహాయింపు ఇస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, గోవాలతో పాటు మహారాష్ట్రలో కూడా టాక్స్ ను మినహాయించారు. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కోరుతున్నారు. రాజస్థాన్ లో కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరారు.
కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాల పన్ను మినహాయింపు
-