జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల తేదీలు రీ – షెడ్యూల్ షెడ్యూల్ అయ్యాయి. దీని ప్రకారం ఏప్రిల్ 16 వ తేదీ నుండి 21 వరకు కాకుండా.. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. అయితే ఎందుకు వాయిదా వేసుకోవాలని అనుకున్నారో చెప్పని అధికారులు.. కొత్త పరీక్ష తేదీలను మాత్రం ప్రకటించారు. జేఈఈ పరీక్షల తేదీల్లో నే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షల నిర్వహిస్తోంది.
అయితే జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తేదీలు రీషెడ్యూల్ కావడంతో ఆ ప్రభావం తెలంగాణ ఇంటర్ పరీక్షల పై పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు రి షెడ్యూల్ చేసింది ఇంటర్ బోర్డ్. మరోసారి చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.
కాగా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 తారీకు నుంచి జరగనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 25 తేదీ నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు అలాగే ఏప్రిల్ 21వ తేదీ నుంచి మే ఐదో తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి.