ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోయిన్ 15 సంవత్సరాలకు మించి టాప్ హీరోయిన్గా కొనసాగడం అంటే అది చిన్న విషయం కాదు. ఇక అందులోనూ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇండియాలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. వారానికో కొత్త హీరో పరిచయం అవుతున్న నేపథ్యంలో కత్రినా కైఫ్ మాత్రం తన డిమాండ్ ను ఏ మాత్రం తగ్గించుకోకుండా చక్కగా మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఒకవైపు వారసులను.. మరొకవైపు సీనియర్ భామల పోటీని తట్టుకుంటూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది కత్రినా కైఫ్.
ఇక ఎంత పోటీ ఉన్నా సరే.. బాలీవుడ్ కి ఎంతమంది దిగుమతి అయినా సరే తనదైన ప్రత్యేకతను చాటుతూనే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మలో కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక కష్టపడే తత్వం కమిట్మెంట్తో పనిచేయడం వంటివి కత్రినాకు స్పెషల్ ఫోకస్ గా చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈమె ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ కూడా తన మార్కు చూపిస్తూ యువతలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఒకవైపు డిజైనర్ దుస్తులు సహా ట్రెడిషనల్ వేర్స్ లో కూడా అలరిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా తాజాగా లెదర్ బ్లాక్ కలర్ స్కర్ట్ లో పెద్ద దుమారమే రేపింది. బ్లాక్ కలర్ లెదర్ కట్ ధరించి కెమెరా ఒక ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఫోన్ భూత్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు నైట్ పార్టీకి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఈ దుస్తుల్లో మెరిస్తే ఎలా ఉంటుందని ఐడియా తట్టిందట. సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ అవ్వాలని భావించి ఇలాంటి డిజైనర్ ని ఎంపిక చేసుకున్న కత్రినా ఇటీవల నైట్ పార్టీలో ఈ ఫోటోలను దిగి ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలలో కత్రినా చాలా హాట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.