కత్రినా విక్కీల రొమాంటిక్ ఫోజులు.. వెకేషన్‌లో సెలబ్రిటీ కపుల్..

-

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రజెంట్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కత్రినా కైఫ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు సంబురపడిపోతున్నారు. భర్తతో హ్యాపీగా కత్రిన ఎంజాయ్ చేస్తోందని అంటున్నారు.

హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సీనియర్ హీరోలు బాలయ్య, వెంకటేవ్ లతో సినిమాలు చేసిన ఈ భామ..ఆ తర్వాత బీ టౌన్ లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో నటించలేదు.

బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయిన కత్రినా కైఫ్ ప్రియుడు విక్కీ కౌశల్ ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. గతేడాది డిసెంబర్ 9న వీరి మ్యారేజ్ జరిగింది. మాల్దీవులకు వెళ్లి సమ్మర్ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల రొమాంటిక్ ఫొటోలను చూసి నెటిజన్లు సంతోషపడుతున్నారు.

వీరిరువు రియల్ లైఫ్ లో జంట కాగా, స్క్రీన్ లోనూ అనగా ఒక చిత్రంలోనూ కలిసి నటించాలని కోరుకుంటున్నారు. కత్రినా కైఫ్ షేర్ చేసే ఫొటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ ఇస్తుండగా, అవి చూసి నెటిజన్లు సంబురపడిపోతున్నారు. ఈ ఫొటోలను చూసి కెరటం, ఐల్యాండ్, హార్ట్ ఇతర ఎమోజీలను షేర్ చేయగా, అభిమానులు వాటిని లైక్ చేయడంతో పాటు లవ్ యూ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ ఫొటోలను సెలబ్రిటీలతో పాటు సామాన్యులు లైక్ చేస్తు్న్నారు. అలా కత్రినా కైఫ్ ఒడిలో సరదాగా బోటింగ్ చేస్తున్న క్రమంలో దిగిన ఫొటోను కత్రిన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా, అది చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. కత్రినా కైఫ్ బ్లాక్ క్యాప్ ధరించి అలా చూస్తుండగా, విక్కీ కౌశల్ బ్లాక్ గాగుల్స్ తో బియర్డ్ లుక్ లో అదిరిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version