త్వరలో సీఎం కేసీఆర్‌ బయోపిక్ తీస్తా – రాంగోపాల్‌వర్మ

-

వివాదాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఏది చేసినా.. వివాదంలాగే ఉంటుంది. ఆయ‌న నోటి దూలతో ఆయ‌న డైలాగ్స్.. ఆయ‌న చేతి దూలతో ట్వీట్స్ ఎప్పుడు వార్త‌లో ఉంటాయి. ఇక ట్విట్ట‌ర్ లో వ‌ర్మ చేసే.. హంగామా అంతా ఇంతా ఉండ‌దు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెట్టి వివాదాల‌ను రేపుతారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ట్వీట్స్ కాస్త ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి.

అయితే… తాజాగా దర్శకుడు రాం గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బయో పిక్ సినిమా త్వరలో తీస్తానని ప్రకటించేశాడు. కెసిఆర్ సినిమాకు సంబంధించిన బయోపిక్ స్క్రిప్టు రెడీ గా ఉందని..స్పష్టం చేశారు. కాశ్మీర్ ఫైల్ సినిమా బాగా నచ్చిందని వెల్లడించారు ఆర్జీవీ. టికెట్ల రేట్ల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. ఢిల్లీలో డేంజరస్‌ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన ఆర్జీవీ…ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. కేసీఆర్‌ బయోపిక్‌ పై పూర్తి వివరాలు మాత్రం చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version