ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్న కత్తి కార్తీక..!

-

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక ఉప ఎన్నికల పోరు హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి . ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీగానే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లో చేరి ప్రచారం నిర్వహిస్తున్న టీవీ నటి యాంకర్ కత్తి కార్తీక ప్రస్తుతం ఓటర్ మహాశయులను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలి అంటూ కోరుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని… దుబ్బాక లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు కత్తి కార్తీక. బహుజన బిడ్డను అయిన తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని బహుజనుల అభివృద్ధికి తాము ఎంతగానో కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. నార్సింగి గ్రామంలో ప్రచారం నిర్వహించారు కత్తి కార్తీక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version