ఇటు కవిత..అటు అవినాష్ రెడ్డికి కోర్టుల షాక్..నెక్స్ట్ ఏంటి?

-

ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె, బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ సి‌ఎం జగన్ సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి …వైఎస్ వివేకా హత్య కేసులో సి‌బి‌ఐ విచారణ ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే కవితని ఈడీ ఓ సారి విచారించింది. ఈ నెల 16న మళ్ళీ విచారణకు రమ్మని కోరింది..కానీ కవిత హాజరు కాలేదు..పైగా ఈడీ విచారణ చేయకుండా అడ్డుకోవాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీం కోర్టు అందుకు అంగీకరించలేదు.

అలాగే ఈ నెల 24కు వాయిదా వేసింది. కానీ త్వరగా తన పిటిషన్ విచారించాలని కవిత కోర్టుకు వెళ్లారు.  అయితే ఈనెల 24నే విచారిస్తామని ఉన్నతన్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇప్పటికే ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే తనని అరెస్ట్ చేయకుండా సి‌బి‌ఐకి ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టుకు అవినాశ్ రెడ్డి వెళ్లారు..అయితే మొదట గత సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదని సి‌బి‌ఐకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈరోజు ఇచ్చిన తుది తీర్పుతో అవినాష్ రెడ్డికి షాక్ తగిలింది.

సీబీఐ అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి హైకోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం. అరెస్ట్‌ చేయొద్దని తాము చెప్పలేమని అవినాష్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక విచారణ ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరి కోర్టుల తీర్పు నేపథ్యంలో నెక్స్ట్ కవిత, అవినాష్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version