గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్తున్నారు. తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 రోజుల పాటు అమెరికాలోనే కల్వకుంట్ల కవిత ఉండనున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీర్వాదం తీసుకునేందుకు కొడుకు ఆర్యతో కలిసి ఎర్రవల్లి… ఫామ్ హౌస్ కు మరికాసేపట్లోనే కల్వకుంట్ల కవిత వెళ్లనున్నారు.

రేపు ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు కల్వకుంట్ల కవిత కుటుంబం వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా… గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత… జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అంతేకాదు మొన్న రక్షాబంధన్ సందర్భంగా కెసిఆర్ అలాగే కేటీఆర్ లకు… రాఖీ కూడా కట్టేందుకు కల్వకుంట్ల కవిత రాలేదన్న సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ కుటుంబం అటు కల్వకుంట్ల కవితకు దూరం పెరిగినట్లు తెలుస్తోంది.