హైదరాబాద్ మేయర్ గా నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారని భావించారు అందరూ. అలాగే ఆమెను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది.
కాని రాజ్యసభ స్థానాలు రెండూ కూడా వేరే వారికి కేటాయించడం తో ఆమెకు రాజ్యసభ పదవి దక్కలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి వస్తుంది అని భావించారు అందరూ. కాని ఇప్పుడు ఆమెకు ఆ పదవి కాదు మరో పదవి ఖాయం చేస్తారని అందరు అనుకున్నారు. ఆమెను హైదరాబాద్ మేయర్ పీఠం మీద కూర్చో బెట్టె అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టారని అంటున్నారు.
ఆమె ఆ పదవి విషయంలో సానుకూలంగానే ఉన్నారని కూడా మీడియా వర్గాలు అంటున్నాయి. రాజకీయంగా కవిత ప్రతిభ ఉన్న నేత. కాస్త దూకుడు కూడా ఉన్న నేత కావడంతో ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఆమెను హైదరాబాద్ మేయర్ పీఠం పై కూర్చోబెడితే హైదరాబాద్ లో పట్టు పెంచుకునే అవకాశాలు ఉంటాయని కెసిఆర్ భావిస్తున్నారట. ఇప్పటికే కేటిఆర్ కూడా హైదరాబాద్ పరిధిలో ఉండే కొందరు కీలక నేతలతో కూడా చర్చలు జరిపినట్టు సమాచార౦. తెరాస నేతలు కూడా ఆమెకు ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నారట.