సుఖేష్ చంద్ర శేఖర్ ఎవరో నాకు తెలీదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటన చేశారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేసిన వాట్సప్ చాట్‌పై ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. స్సలు సుఖేష్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు కవిత.
బీఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ని ఎదుర్కునే ధైర్యం లేఖ నా మీద దాడి చేస్తున్నారని.. ఫేక్ చాట్ విడుదల చేస్తూ తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సుఖేశ్ చంద్రశేఖర్‌తో తనకు ఏలాంటి పరిచయం లేదన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.