టీ కాంగ్రెస్ నేతలపై కేసీ వేణుగోపాల్ ఫైర్‌.. ఇలాగే ఉంటే కష్టమని వ్యాఖ్య

-

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీ నేతలు ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ స్టార్ట్‌ చేసుకున్నారు. అయితే.. ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది బీఆర్‌ఎస్‌. అయితే.. తెలంగాణ వచ్చిననాటి నుంచి చెతికిలపడ్డ కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ రోజు మంత్రి కేటీఆర్‌ సైతం అసెంబ్లీ సమావేశాల్లో టీ కాంగ్రెస్‌ నేతల్లో ఐక్యత లేదన్నట్లుగా విమర్శలు సంధించారు. అయితే.. వరుసగా ఎన్నికలకు సంబంధించిన కమిటీలు ప్రకటిస్తూ తుది సమరానికి సిద్ధం అవుతుంది కాంగ్రెస్‌.

అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఇవాళ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆయన క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మీకు ఇంకా 100 రోజులే సమయం ఉందని.. అన్ని పక్కన పెట్టి ఈ 100 రోజులు కష్టపడి పని చేయాలని సూచించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇంకా మేం ఇలాగే కొట్లాడుకుంటామంటే ఇక మీ ఇష్టమన్నారు. ఓ నలుగురు నేతలు నేతలు అన్నీ పక్కన పెట్టి ఈ 100 రోజులు కలిసి పనిచేయండని సూచించారు. పార్టీ అధికారంలోకి వస్తే తాము ఇక్కడికి వచ్చి మంత్రులం కామని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ భేటీలో కేసీ వేణుగోపాల్ ముందే మండలి కమిటీల గురించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హాట్ హాట్‌గా చర్చించుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version