కెసిఆర్ 5 లక్షల కోట్లు.. జగన్ 8 లక్షల కోట్లు అప్పులు చేశారు – కేఏ పాల్

-

ముఖ్యమంత్రి కెసిఆర్ ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారని, జగన్మోహన్ రెడ్డి 8 లక్షల కోట్లు అప్పులు చేశారని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై బుధవారం రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ధర్నాకి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు.కెసిఆర్, జగన్, పవన్ కళ్యాణ్ ఇతర పార్టీకి చెందిన నాయకులు ధర్నాకు రావాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ధర్నాకు మద్దతు తెలిపి పదినిమిషాలు తనతో పాటు కూర్చోవాలని డిమాండ్ చేశారు.తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అంతా హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.కరోనా సమయంలో కేసీఆర్ పారాసిటీ మాల్ వేసుకోవాలని చెప్పాడని దానివల్ల లక్షల మంది చనిపోయారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బ్రస్ట్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల్లో 9 పార్టీలతో జతకలిసాడని అన్నారు.టిడిపి, బిజెపి, కమ్యూనిస్టు పార్టీలు అన్ని పార్టీలతో జత కలిశాడు… పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ని ఎవరు నమ్మటం లేదని, అందుకోసమే ఒక్క లీడర్ కూడా ఆయన దగ్గర ఉండట్లేదన్నారు.జేడీ లక్ష్మీనారాయణ లాంటి నాయకులు పార్టీ విడిచి వెళ్లిపోయారని అన్నారు.నేను హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే గుజరాత్ లో పెట్టాలని బిజెపి నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు.తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం నేను హైదరాబాదులోనే గ్లోబల్ సమ్మిట్ పెడతానని తెలిపారు.నేను రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడనన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version