పొత్తు లెక్కలో కేసీఆర్..సింగిల్‌గా కమలం..2018 సీన్ రిపీట్!

-

మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండుసార్లు తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కే‌సి‌ఆర్..ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత టి‌డి‌పి, కాంగ్రెస్ పార్టీ నేతలని లాక్కుని బలపడి..2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

అప్పుడు కాంగ్రెస్, టి‌డి‌పి, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, టి‌జే‌ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాకపోతే అప్పుడు టి‌డి‌పి పోటీ చేసిన సీట్లు తక్కువే. కానీ కే‌సి‌ఆర్ చంద్రబాబుని బూచిగా చూపించి..మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్‌ని లేపి అప్పుడు ఎన్నికల్లో లబ్ది పొంది గెలిచారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కే‌సి‌ఆర్..కేంద్రంలోని బి‌జే‌పిని టార్గెట్ చేశారు. దీని ద్వారా లబ్ది పొందాలనే స్కెచ్ వేశారు. అయితే ఈ సారి అనుకున్నంత ఈజీగా కే‌సి‌ఆర్ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఎదురు ఉన్నది బి‌జే‌పి. కాబట్టి కే‌సి‌ఆర్‌ని అన్నివిధాలుగా నిలువరించే సత్తా బి‌జే‌పికి ఉంది.

తెలంగాణలో బి‌జే‌పి ..ఏ స్థాయిలో కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారో తెలిసిందే. ఈ క్రమంలో కే‌సి‌ఆర్ సైతం కాస్త ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు. అందుకే కే‌సి‌ఆర్ ఇప్పుడు పొత్తుల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులతో కలిసి ముందుకెళ్లాలని చూస్తున్నారు. అటు ఎం‌ఐ‌ఎం తో కలిసే ఉన్నారు. అంటే ఎం‌ఐ‌ఎం, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం లతో కే‌సి‌ఆర్ కలిసి ముందుకెళ్లనున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ తో కూడా పొత్తు ఉంటుందని ప్రచారం వస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం కే‌సి‌ఆర్ తో పొత్తు ప్రసక్తే లేదనే చెబుతుంది. అయితే కే‌సి‌ఆర్ పొత్తు వైపు ఆలోచిస్తున్నారంటే..బి‌ఆర్‌ఎస్ బలం తగ్గినట్లే. దీంతో కే‌సి‌ఆర్ ఎంతమందితోనైనా కలిసి రావచ్చు అని, గుంపులుగా వచ్చిన తాము సింగిల్ గా వస్తామని బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. అంటే 2018లో బి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని..కాంగ్రెస్, టి‌డి‌పి, సి‌పి‌ఐ, సి‌పి, టి‌జే‌ఎస్‌లు కలిసి పోటీ చేసి విఫలమయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో బి‌ఆర్‌ఎస్, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, ఎం‌ఐ‌ఎంలు పొత్తుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version