నా కూతురుది ఆత్మహత్య కాదు.. హత్య : ప్రీతి తండ్రి

-

నిమ్స్‌లో అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్‌ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే నిమ్స్‌లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మరణంపై ఆమె తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తన కూతురు ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని ఆమె తండ్రి ఆరోపించారు. సీనియర్ విద్యార్థి సైఫ్ మొదట ప్రీతికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్లాన్ తో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించినట్లు చెప్పారు. పోలీసులు విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని వెల్లడించారు.
మరోవైపు ప్రీతి మృతదేహం జనగామ జిల్లాలోని స్వగ్రామానికి చేరుకుంది. ప్రీతి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ప్రీతి అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version