కెసిఆర్ ని మించిన ఫాసిస్ట్, నియంత, అప్రజాాస్వామిక, అహంకారవాది మరొకరు లేరని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయనకు అధికార దాహం తప్ప మరొకటి లేదన్నారు. ఈటెల రాజేందర్ ని శాసనసభకు రానీయను, ఆయన ముఖం చూడను అంటున్న కెసిఆర్ కన్నా ఫాసిస్టు ఎవరు ? అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ ని చూడడం ఇష్టం లేకపోతే కెసిఆర్ అసెంబ్లీకి రావద్దంటూ సూచించారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వ్యక్తి ఈటెల అని.. ఈటల రాజేందర్ ని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈటెల వ్యాపారాన్ని, ఆస్తులను, కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. “తెలంగాణ ని జాగీరా కేసీఆర్.. నువ్వేమన్న నిజం వా” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ప్రజల తీర్పును కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముందు కెసిఆర్ ని శాశ్వతంగా సభ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మోడీని గద్దె దించడం కాదు.. ఉన్న ఎనిమిది సీట్లు కూడా వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఊడగొడతారని అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి వారికి ప్రజలు ఎప్పుడూ అండగా నిలబడరని అన్నారు.