త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి.. మెగా ఫ్యాన్స్ హ్యాపీ.. !!

-

స్టైలిష్ స్టార్ అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ ‘పుష్ప-2’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. కాగా, అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. దాని ప్రకారం.. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల మహేశ్ బాబుతో SSMB28 షూట్ స్టార్ట్ చేశారు. కాగా, ఈ సినిమా పూర్తయిన తర్వాత బన్నీతో మూవీ చేయడానికి స్టోరి రెడీ చేశారట. ఆల్రెడీ బన్నీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘ అల వైకుంఠపురములో’ మూవీస్ చేశారు.

ఇప్పుడో మరోసారి వీరి కాంబోలో పిక్చర్ రాబోతున్నదని తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ చేయబోయే సినిమా డెఫినెట్ గా అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు. వీరు కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ పిక్చర్ ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అంతకు మించి రాబోయే చిత్రం ఉండాలని అంటున్నారు అభిమానులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

Trivikram describing a scene in ‘Ala Vaikuntapuramlo’ to Allu Arjun

‘పుష్ప-2’ కోసం నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుందో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version