కేసీఆర్ మాటలకు, చేష్టలకు… రేవంత్ మార్కు సమాధానాలు ఇవి!

-

గజ్వేల్ లో జరిగిన భారి బహిరంగ సభలో టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్ పై విమర్శల వర్షాలు కురిపించారు. విచిత్రం ఏమిటంటే… రేవంత్ ప్రసంగం మొత్తం కేవలం కేసీఆర్ సర్కార్ ని విమర్శించేలా మాత్రమే సాగలేదు! ప్రశ్నలు – సమధానాలు – వివరణలు – నిలదీతలతో సాగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! రేవంత్ తాజా మాటలు… కచ్చితంగా బహుజనుల్లో ఆలోచనలకు మరింత పదునుపెడుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి!

“తెలంగాణ అంటే పిడికెడు మట్టి కాదు.. ఎంతోమందికి పాటం నేర్పిన గడ్డ. తెలంగాణ అంటే దోపిడీదారుల గుండెల్లో ల్యాండ్ మైన్లు పేల్చిన ల్యాండ్. తెలంగాణ అంటే.. నిజాముల పైజాములు ఊడగొట్టిన గడ్డ. తెలంగాణ అంటే… రజాకార్లను దిగాంతాలకు తరిమికొట్టిన గడ్డ. తెలంగాణ అంటే… దొరల గడీలను బద్దలుగొట్టిన గడ్డ. తెలంగాణ అంటే… ఇకచాలు దొరా నీ పాలన.. నిన్ను వంద మీటర్ల గోతి తీసి గజ్వేల్ గడ్డమీద పాతిపెట్టడం అని గళం విప్పిన బిడ్డల గడ్డ” అంటూ మొదలైంది రేవంత్ ప్రసంగం!

“తెలంగాణ అంటే పిడికెడు మట్టి” అని కేసీఆర్ చెబుతున్న మాటలకు ఈ రేంజ్ లో సమాధానాలు ఇచ్చారు రేవంత్!

“చదువుకునే పిల్లలకు మంచి చదువు చెబుతాడు.. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు.. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ బృతి ఇస్తాడు.. దళితులకు – గిరిజనులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాడు.. మూడెకరాల భూమి ఇస్తాడు అని కేసీఆర్ ను రెండుసార్లు కుర్చీ ఎక్కించారు. కానీ… దగుల్బాజీ అయిన కేసీఆర్ ఇక్కడనుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి, రెండు సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి.. చేసిందేమిటి?

కేసీఆర్ ఇప్పటివరకూ ఇచ్చిన హామీలు అద్భుతంగా అమలవుతున్నాయన్న మాటలకు రేవంత్ మార్కు సమాధానం ఇది!

“జనాభాలో అర్థశాతం ఉన్న నీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలుంటే… 12శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రిపదవైనా ఇచ్చినావా కేసీఆర్.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది నీ కొంపలో ఉద్యోగాల కోసం కాదు.. బహుజనుల బిడ్డల బ్రతుకులు మారడానికి” అంటూ రేవంత్ స్పందించారు.

తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పిన మాటలకు రేవంత్ మార్కు సమాధానం ఇది!

“కెసీఆర్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు – నీ మనవడు తింటున్న సన్నబియ్యం కాదు కావాల్సింది.. నీ మనవడు చదువుకుంటున్న బడుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు చదువుకునేలా చేయాలి. చేశావా? ఆ జ్ఞానం నీకుందా? సన్నబియ్యం కోసమో, చేప పిల్లలకోసమో, గొర్రెలకోసమో, బర్రెలకోసమో వందలాదిమంది దళిత బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారనుకుంటున్నావా కేసీఆర్…  కావాలంటే నువ్వూ నీ కుటుంబం పందిపిల్లలను పెంచుకోండి కానీ… దళిత బిడ్డలకు మంచి చదువులు కావాలి, తద్వార వారి బ్రతుకులు మారాలి”!

“కేసీఆర్ మనవడు తింటున్న సన్నబియ్యమే.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు చదువుకుంటున్న హాస్టల్లలో పెడుతున్నారు” అన్న అధికారపక్ష మాటలకు, గంగపుత్రుల పిల్లలకు చేపల పిల్లలు, గొల్లల పిల్లలకు గొర్రెలు, యాదవ పిల్లలకు బర్రెలు ఇస్తున్నామన్న కేసీఆర్ మాటలకు రేవంత్ మార్కు సమాధానం!

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్.

బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును మార్చే ఒక్కపనైనా ఇప్పటివరకూ కేసీఆర్ చేశారా?

గొర్రె పిల్లలు, చేప పిల్లలు, బర్రె పిల్లలు పంచడమేనా… కేసీఆర్ మార్కు బడుగుబలహీనవర్గాల అభివృద్ధి? అందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది?

చెట్టెక్కిన మూడెకరాల భూ పంపిణీ ని ఏమార్చి – అరెకరం భూమి కూడా కొనలేని పది లక్షల రూపాయలు ఇస్తున్నాడు… కేసీఆర్ దళితులను మరోసారి ఏమారుస్తున్నరానే అనుకోవాలా?

అంటూ… సోషల్ మీడియా వేదికగా రేవంత్ సమధానాలకు, వివరణలకు.. కేసీఆర్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు!

Read more RELATED
Recommended to you

Exit mobile version