MAA ELECTIONS : మా ఎన్నికల బరిలో రఘుబాబు

-

మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజుకో మలుపు తో మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు… రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో… ఈ ఎన్నికల్లో మరో ట్విస్ట్‌ నెలకొంది. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానల్‌ ను ప్రకటించగా… తాజాగా విష్ణు ప్యానల్‌ నుంచి కీలక నటుడి పేరు బయటకు వచ్చింది.

నటుడు రఘ బాబు ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానల్‌ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన జనరల్‌ సెక్రటరీ గా విజయం సాధించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొ దలు పెట్టేశారు. ఇక మరో వైపు.. జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీ పడుతున్నారు. అటు…నిర్మాత బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇటీవలే… ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి బయటకు వెళ్లిన బండ్ల గణేష్‌.. స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version