మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఎకౌంట్ ఉందా..? అయితే తప్పకుండ మీరు దీని గురించి తెలుసుకోవాలి. దేశీ రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ రెపో ఆధారిత లెండింగ్ రేటును తగ్గిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
తాజాగా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ రెపో ఆధారిత లెండింగ్ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలకు రిలీఫ్ గా ఉంటుంది అనే చెప్పాలి. ఇక ఇది ఇలా వుంది అనేది చూస్తే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో రెపో ఆధారిత లెండింగ్ రేటు RLLR (ఆర్ఎల్ఎల్ఆర్) 6.8 శాతం నుంచి 6.55 శాతానికి దిగొచ్చింది.
ఈ రేట్లు సెప్టెంబర్ 17 నుంచే అంటే నిన్నటి నుండే అమలు లోకి రావడం జరిగింది. ఇది ఇక ఉండగా ఆర్ఎల్ఎల్ఆర్ అనేది 2019 అక్టోబర్ నుంచి అందుబాటు లోకి తీసుకు వచ్చారు. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రెపో రేటు తో ఆర్ఎల్ఎల్ఆర్ లింక్ అయ్యి ఉంటుంది కదా…! అంటే రెపో తగ్గితే.. ఆర్ఎల్ఎల్ఆర్ కూడా తగ్గుతుంది. బ్యాంకులు రిటైల్ రుణాలను ఆర్ఎల్ఎల్ఆర్ ప్రాతిపదికన జారీ చేస్తుంటాయి.