కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఉంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో ఈ లాక్ డౌన్ మల్ల్లీ ఉండబోదని అసెంబ్లీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు.
వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కేసేఆర్ తెలిపారు. స్కూల్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం మూసివేశామని.. అది కూడా తాత్కాలికమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలానే లాక్ డౌన్ మీద తమ ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోదని.. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.