వైయస్సార్ కి కెసిఆర్ తీరని అన్యాయం చేశారు: వైయస్ షర్మిల

-

వైయస్ రాజశేఖర రెడ్డికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.నేడు వైయస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైయస్సార్ టిపి స్థాపించిన సంవత్సర కాలంలోనే ఎంతో పురోగతి సాధించింది అన్నారు. పార్టీ పెట్టకముందు నుంచే నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు. మా దీక్షల వల్లే పాలకపక్షానికి బుద్ధి వచ్చిందని, ప్రతిపక్షాలకు సోయి వచ్చిందని అన్నారు.

ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తూనే ఉన్నానని తెలిపారు. ఇప్పటి వరకు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఇంకా కొనసాగిస్తానని అన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీకి తెలంగాణలో సెంటు భూమి కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటని టిఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. “టిఆర్ఎస్ భవన్ వైయస్సార్ ఇచ్చిందే అని.. కెసిఆర్ రాజశేఖర్ రెడ్డి కి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version