మతిమరుపుకు దాల్చిన చెక్క, డార్క్‌ చాక్లెట్స్‌..!

-

మతిమరుపు అనేది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఉంటుంది. ఏజ్‌ పెరిగే కొద్ది మతిమరుపు రావడం సహజం అని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి పోషకాహార లోపం వల్ల మతిమరుపు వస్తుందని నిపుణులు అంటున్నారు. మెదడు కుచించుకుపోవడం, కణాలు చనిపోవడం వల్ల డిమోన్షియా వస్తుంది. డిమెన్షియా అనేది ఒక కామన్‌ ఆరోగ్య పరిస్థితి. మతిమరుపు ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం. డైలీ డైట్‌లో ఇవి చేర్చుకోవడం వల్ల మతిమరుపు సమస్య నుంచి బయటపడొచ్చు.
ఆకుపచ్చ కూరగాయలు: ప్రధానంగా బ్రోకలీ, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ మొదలైన వాటితో సహా ఆకుపచ్చ కూరగాయలు క్రూసిఫరస్ కూరగాయలు శరీరానికి, మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి. డైలీ ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.
బాదం: బాదంపప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్‌ని సూపర్ ఫుడ్స్ అని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. ఇవి అనేక పోషకాలతో నిండి ఉంటాయి.
చేప: చేపలలోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి అని చిన్నప్పటి నుంచే వింటూనే ఉన్నాం.. కానీ ఆదివారం వస్తే చికెన్‌, మటన్‌ వైపే జనాలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. చేపలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొవ్వు ఆమ్లాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వృద్ధాప్యం వల్ల వచ్చే కణాల నష్టాన్ని కూడా తగ్గిస్తాయి.
చికెన్: చికెన్‌లో ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ B6, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే రెగ్యులర్‌గా చికెన్‌ తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి., కాబట్టి మసాలాలు తగ్గించి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా చేసుకుని తినాలి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లలో పోషకాలు పుష్కలంగా ఉన్నందున వాటిని సూపర్‌ఫుడ్‌ అంటారు. తలనొప్పి ఉన్నప్పుడు డార్క్‌ చాక్లెట్స్‌ చాలా బాగా పనిచేస్తాయి. అవి చిత్తవైకల్యం, జ్ఞాపకశక్తి సంబంధిత ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క వంటల్లో సువాసన కోసం ఉపయోగించే మసాలా దినుసు మాత్రమే కాదు..ఇది తీసుకోవడం వల్ల మెదడులో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుందని చాలా అధ్యయనాలు ఇప్పటికే నిరూపించాయి.
కెఫిన్ పానీయాలు: కాఫీ, టీ వంటి కెఫిన్ డ్రింక్స్ శక్తిని పెంచే డ్రింక్స్‌గా పరిగణించబడతాయి. ఇవి స్టామినాను పెంచడమే కాకుండా మూడ్ బూస్టర్లుగా కూడా పనిచేస్తాయి. అందుకే మనకు ఉదయం, సాయంత్రం టీ లేదా కాఫీ మీదకు మనసు వెళ్తుంది. ప్రజర్‌లో ఉన్నప్పుడు వేడివేడి చాయ్‌ తాగితే మంచి రిలీఫ్‌గా ఉంటుంది. ఇవి జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అయితే ఎక్కువ తాగడం మంచిది కాదు. వీటిలో ఉండే కెఫిన్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
మతిమరుపు సమస్యతో బాదపడుతుంటే..వీటిని ట్రై చేయండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version