మహిళ సంఘాలకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త..త్వరలోనే వడ్డీ లేని రుణాలు

-

త్వరలోనే స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు. అభయ హస్తం డబ్బులను ఎల్‌ఐసీ ఇటీవల ప్రభుత్వానికి అందజేసిందని.. వాటిని మిత్తితో సహా సంబంధిత మహిళలకు అందజేస్తామని వెల్లడించారు. అలాగే వచ్చే రెండు, మూడు నెలల్లోగా అర్హులకు కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని.. కేంద్రం ఎఫ్ సి ఐ ద్వారా పంట కొనుగోలు చేయాలని రాజ్యాంగంలోనే ఉందని చెప్పారు. గతంలో చాలా మంది ప్రదానులుగా చేసిన వారు వడ్లు కొనుగోలు చేశారని.. మొట్టమొదటి సారి మోడీ ప్రభుత్వం వడ్లు కొనమని మొండికేస్తుందని ఆగ్రహించారు.

పంజాబ్ లో వడ్లు కోని తెలంగాణ లో ఎందుకు కొనడం లేదని మన ఎంపీ లు ఢిల్లీలో కొట్లాడుతున్నారని.. పంజాబ్ కి ఒక న్యాయం.. తెలంగాణ కు ఒక న్యాయమా ? అని ఫైర్‌ అయ్యారు. మద్దతు ధర వడ్ల కు ఇచ్చి బియ్యం కొంట అంటే ఎలా ? బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version