రాబోయే రాజ్యసభ ఎన్నికలలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎలక్షన్ ముందు ఎవరికీ ఆ రెండు స్థానాలు కేటాయించాలి కేసీఆర్ అర్థంకాని పరిస్థితిలో అతి పెద్ద కష్టం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది పేర్లు ఈ రెండు రాజ్యసభ స్థానాలు కోసం వినబడుతున్నాయి.
ముఖ్యంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కేసిఆర్ కుమార్తె కవిత మరియు సీనియర్ నాయకులు కేశవరావు పేరు ఎక్కువగా వినబడుతోంది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా తమకి అవకాశం కల్పించాలని మరోవైపు కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇంకోవైపు పారిశ్రామికవేత్తల నుండి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసిఆర్ ఎవరిని రాజ్యసభకు పంపుతారో అన్న టెన్షన్ టిఆర్ఎస్ పార్టీలో నెలకొంది.