కేసీఆర్ కామారెడ్డి లో , కూతురు నిజామాబాద్ లో చెల్లలేదు : రఘునందనరావు

-

సిద్దిపేట జిల్లా బీజేపి కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

రఘునందన్ రావు దుబ్బాక లో ఓడిపోతే కేసీఆర్‌ కామారెడ్డి లో ఓడిపోలేదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినా కేసీఆర్ కి సిగ్గు ఉండాలని, వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చాడని ఆయన నిలదీశారు. కేసీఆర్ కి తెలంగాణ పౌరుషం ఉంటే వేంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చి డబ్బులు పంచలేదని ప్రమాణం చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ కామారెడ్డి ల్లో, కూతురు నిజామాబాద్ లో చెల్లలేదు.. కొడుకు ఎంపీ గా పోటీకి ముందుకు రాలేదని ఎద్దేవ చేశారు. వెంకట్రామిరెడ్డి కెసిఆర్, హరీష్ రావు కి బినామీ కాదని చెప్పాలన్నారు.రఘునందన్ రావు మెదక్ ఎంపీ గా గెలవడం ఖాయమని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.మిమ్మల్ని శ్రీ కృష్ణ జన్మస్థలానికి పంపడం ఖాయమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version