అలా చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే : జేడీ లక్ష్మీనారాయణ

-

పోస్టల్ బ్యాలెట్ ఓటర్‌ల యొక్క పూర్తి వివరాలు ఒక అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు మాత్రమే ఆర్‌వో అందించడం దుర్మార్గపు చర్య అని ,ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని విశాఖ ఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మిగిలిన పార్టీల అభ్యర్థులకు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓటర్‌ల యొక్క పూర్తి వివరాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు .స్వయంగా అభ్యర్థి అడిగినా కూడా అనేక కారణాలు చెప్పి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఏయూ క్యాంపస్‌లో పోలింగ్ బూత్‌ను సందర్శించిన జెడి అక్కడి ఓటర్లు కలిసి కొన్ని వాస్తవాలు తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. అక్కడ ఓటర్లు సమాచారం ప్రకారం 7670 807307 అనే నెంబర్ నుండి ఫోన్ చేసి మీరు ఓటు కేకే రాజుకు వేశారా? ఒకవేళ వేయకపోతే కేకే రాజుకి ఓటు వేయాలని మభ్యపెడుతున్నారని అన్నారు .కొంతమంది ఓటర్లు ఓటు వేసేటప్పుడు ఫోటో తీసి అధికార పార్టీ కార్యకర్తలకు పంపగా ఆ ఓటర్‌కు ఫోన్ ద్వారా డబ్బులు ట్రాన్ఫెర్ చేస్తున్నారని తెలిసింది.ఈ విషయాలపై జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version