కే‌సి‌ఆర్ ఎంత తోపు అనేది కాంగ్రెస్ చూపిస్తోంది..!!

-

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయింది. దానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు.

దీంతో ఈ మధ్య విమర్శలు ఎక్కువ అవటంతో పీసీసీ అధ్యక్షుడి పదవి నుండి స్వయంగా తప్పుకుంటానని ఉత్తమ్ ప్రకటించేశారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు రాబోతున్న ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడంలేదని బహిరంగంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

 

మరోపక్క అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకుని ఎక్కడికక్కడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వల్లే…తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పార్టీ దూసుకుపోతుందని కామెంట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా కెసిఆర్ రాజకీయాల్లో రాష్ట్రంలో గొప్ప తోపు నాయకుడిగా ఎదగటానికి ఒకే ఒక్క కారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మధ్య అంతర్గత విభేదాలని కామెంట్ చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version