ఏ ముద్దు ఏ భావాన్ని ప‌లికిస్తుందో తెలుసుకోండి….!

-

ఎలా ముద్దు పెట్టుకుంటే.. ఏం భావం తెలిపిన‌ట్లు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

నుదుటిపై ముద్దు…
నుదుటిపై ముద్దు పెట్టుకుంటే ఒకరిపై ఒక‌రికి ఉన్న ప్రేమ‌, అనురాగాన్ని తెలిపిన‌ట్లు అవుతుంది. ఒక‌రికి ఒక‌రు మ‌ర్యాద ఇచ్చి పుచ్చుకున్న‌ట్లు అవుతుంది. అలాగే ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రు గౌర‌వించిన‌ట్లు అవుతుంది.

బుగ్గ‌పై…
బుగ్గ‌పై ముద్దు పెట్టుకుంటే వారంటే మీకు చాలా ఇష్టం ఉన్న‌ట్లు అర్థం చేసుకోవాలి. బాగా ద‌గ్గ‌ర‌గా, చ‌నువుగా ఉండేవారే ఇలా బుగ్గ‌పై ముద్దు పెట్టుకుంటారు.

చేతిపై…
ఒక‌రి చేతిపై మీరు ముద్దు పెట్టుకుంటే.. వారిని మీరు కోరుకుంటున్న‌ట్లు అర్థం చేసుకోవాలి. వారంటే మీకు ఆస‌క్తి ఉన్న‌ట్లు తెలుసుకోవాలి.

బ‌ట‌ర్‌ఫ్లై కిస్‌…
ఒకరి క‌ను రెప్పులు మ‌రొక‌రికి తాకే విధంగా ముద్దు పెట్టుకోవ‌డాన్నే బ‌ట‌ర్ ఫ్లై కిస్ అంటారు. ఈ కిస్ పెట్టుకుంటే ఒక‌రంటే ఒక‌రికి పిచ్చి ప్రేమ అని అర్థం చేసుకోవాలి.

ఎయిర్ కిస్‌…
అర‌చేతిలో ముద్దు పెట్టి దాన్ని అవ‌త‌లి వ్య‌క్తికి గాలిలో ఊది పంపాలి. దీన్ని ఎయిర్ కిస్ అంటారు. ఇది మ‌న‌తో చ‌నువుగా ఉండే అవ‌త‌లి వారికి పెడ‌తాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version