కేసీఆర్ ఎప్పుడు ఎలా మాట్లాడినా…అది కేవలం రాజకీయంగా ఉంటుందనే చెప్పాలి. రాజకీయ లబ్ది లేకుండా కేసీఆర్ ఉత్తిగా ఏది అనరనే చెప్పాలి. ఏదొక రాజకీయ కోణం లేకుండా కేసీఆర్ మాటలు ఉండవు. ఇక తాజాగా ఆయన రాజ్యాంగం మార్చాలనే మాటలు వెనుక కూడా ఏదో రాజకీయ కోణం ఉంటుందనే చెప్పాలి. ఏదో దేశం కోసం అన్నట్లు మాట్లాడారు గాని, దీని వెనుక మాత్రం ఖచ్చితంగా రాజకీయ పరమైన అంశం ఉంటుంది. దేశ రాజకీయాల్లో కూడా కీలకం కావాలని చూస్తున్న కేసీఆర్…ఇలా రాజ్యాంగం మార్చాలనే మాటలు ద్వారా హల్చల్ చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది.
అయితే కేసీఆర్ రాజ్యాంగం మాటలు కాస్త దళితుల వైపు వెళ్లిపోయాయి…కేసీఆర్ దళితులకు ద్రోహం చేస్తున్నారని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి చివరకు తానే సీఎం అయిన దళిత ద్రోహి కేసీఆర్ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలా దళితులని తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ బాగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
పైగా ఇటీవలే మిషన్-19 పేరిట రాష్ట్రంల్ని 19 దళిత నియోజకవర్గాల్లో బీజేపీ బలపడాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు పరోక్షంగా బీజేపీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఉపయోగ పడేలా ఉన్నాయి. దళిత నియోజకవర్గాల్లో బీజేపీ బలపడటానికి మంచి అవకాశం దొరికినట్లు అయింది.