KCR అంటే.. కిలాడి చంద్రశేఖర్ రావు – పొంగులేటి సుధాకర్

-

సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. సీఎం కెసిఆర్ బీహార్ పర్యటన ఒక డ్రామా అని అన్నారు. హిట్ పిక్చర్ చేద్దామని పోయి బొక్క బోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు పొంగులేటి. కాంగ్రెస్ తో ఉన్న.. నితీష్ కుమార్ తో కెసిఆర్ కలిశారని అన్నారు. కెసిఆర్ తెలంగాణ పరువును తీశారని మండిపడ్డారు. తెలంగాణ సమస్యలు గాలికి ఒదిలేసారని అన్నారు. మోడీ కి కెసిఆర్ సర్టిఫికెట్ అక్కర లేదన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి.

కాంగ్రెస్ చోడో… భారత్ జోడో దేశం లో నడుస్తుందన్నారు. కెసిఆర్ మహారాష్ట్ర పోయాడు అయన పని అక్కడ అయిపోయింది… జార్ఖండ్ పోయాడు అయన పని అవుతుంది… బీహార్ పోయాడు అక్కడ ఏమవుతుందో.. అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు కెసిఆర్ అంటే కిలాడి చంద్ర శేఖర్ రావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కమ్యూనిష్టులు కమర్షియలిస్ట్ లు అయ్యారని చురకలాంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version