గత తొమ్మిది నెలల తర్వాత రాష్ట్ర రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వచ్చారు. ఇవాళ ఉదయం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం రాజ్ భవన్ లో జరగడంతో కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్. గత కొన్ని రోజులుగా గవర్నర్ తమిళ సై మరియు టిఆర్ఎస్ సర్కార్ ల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళిసై తెలంగాణ సర్కార్ పై విమర్శలు చేయడం.. ప్రధానికి ఫిర్యాదు చేయడం జరిగింది.
వాటికి అంతే దీటుగా సర్కారు నుంచి కౌంటర్ కూడా వెళ్ళింది. కాగా నేడు ఉజ్జల్ భూయన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ పాత విభేదాలను పక్కన పెట్టి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నరు ఇచ్చిన తేనీటి విందులో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒక టేబుల్ పై కూర్చొని ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కూడా కేసీఆర్ మాట్లాడారు. అందరూ నవ్వుతూ ఆత్మీయంగా మాట్లాడుకోవడం తో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.