కారు వర్సెస్ కమలం: మధ్యలో కాంగ్రెస్ కనికట్టు..!

-

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి..అధికారం కోసం పార్టీలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ముందుకొస్తున్నాయి..ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ మధ్య తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్యే వార్ ఎక్కువ నడుస్తోంది. కేసీఆర్ పాలనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో  ఫైర్ అవుతుంటే..కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు సైతం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఎవరికి వారు తగ్గకుండా రాజకీయం నడిపిస్తున్నారు. అసలు రాష్ట్రంలోనే కాదు…కేంద్రంలో కూడా బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ ని గద్దెనెక్కకుండా చేయాలని బీజేపీ చూస్తుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక తమని ఇబ్బంది పెడుతున్న బీజేపీని ప్రజల్లో నెగిటివ్ చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అలాగే వచ్చే నెలలో హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా…తెలంగాణలో బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది..ఆ సమావేశాలు ఎలాగైనా ఫెయిల్ అయ్యేలా చేయాలన్నట్లు టీఆర్ఎస్ చూస్తుంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ లో బీజేపీకి ఛాన్స్ ఇవ్వకుండా…ఆఖరికి మెట్రో పిల్లర్లని రెంట్ కు తీసుకుని టీఆర్ఎస్ బ్యానర్లతో నింపేయాలని చూస్తుంది.

ఇలా తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అయితే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే..మధ్యలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఎత్తుగడలతో రాజకీయం చేస్తుంది. ఇప్పటివరకు కాస్త రేసులో వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది. అలాగే పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…సైలెంట్ గా టీఆర్ఎస్ నేతలని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఈ చేరికలని ఆపడంలో టీఆర్ఎస్ విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది.

అదే సమయంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటున్న బీజేపీ..ఇతర పార్టీల నేతలని ఆకర్షించడంలో విఫమలవుతుంది. మొత్తానికి టీఆర్ఎస్-బీజేపీ యుద్ధంలో కాంగ్రెస్ లాభపడేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version