గుప్పించారు. ‘ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఆ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు పది, పన్నెండు అవకాశాలు ఇచ్చారు. కానీ ఆ పార్టీ రాష్ట్రాన్ని అంధకారం చేసింది. తొమ్మిదేళ్ల క్రితం ఎక్కడ చూసినా కటిక చీకటి ఉండేది. 14 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో రైతు కంటి నిండ నిద్ర పోతుండు. కడుపు నిండ కరెంటు, కళ్లాల నిండ వడ్లు ఉన్నాయి’ అని తెలిపారు.
ఇది ఇలా ఉంటె, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం ఉదయం విడుదల చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నుంచి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, మధిర నుంచి భట్టి విక్రమార్క.. బరిలో ఉంటారని ఫస్ట్ లిస్ట్ లో వెల్లడించింది. వీరితో పాటు మొత్తం 55 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అందులో 12 మంది కొత్త వారే ఉన్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఈసారి కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. తొలి జాబితాలో ఈ పేరు లేదు. కామారెడ్డి టికెట్ కోసం ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో గడిచిన కొన్ని నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.