జాతిపిత గాంధీజీని తిట్టడం ఏంటి.. ఇదానే మన సంస్కృతి.. ? : సిఎం కేసీఆర్

-

జాతిపిత గాంధీజీని తిట్టడం ఏంటి.. ఇదానే మన సంస్కృతి.. ? అని ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర సిఎం కేసీఆర్. దేశంలో మత చిచ్చు రేపుతున్నారు.. జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు.

ఇదా మన సంస్కృతి.. ఇదేనా భారతదేశం.. ఏం ఆశించి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ? దేశాన్ని ఎటు తీసుకువెళ్తున్నారు? అని టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయం కాదు.. ప్రత్యామ్నాయ అజెండా కావాలని పిలుపునిచ్చారు..

నూతన వ్యవసాయ విధానం రావాలి.. నూతన ఆర్ధిక విధానం రావాలని కోరారు.. నూతన పారిశ్రామిక విధానం రావాలి.. దేశంలో నీటి కోసం యుద్ధాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? అని ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. టి ఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని తెలిపారు. తెలంగాణ లో పాలన దేశానికే రోల్ మోడల్ అని… దేశంలో 10 ఉత్తమమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లె లేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version