కర్ణాటకలో హిజాబ్, హలాల్ పేరుతో విద్వేశాలను రెచ్చగొడుతున్నారు: సీఎం కేసీఆర్

-

దేశంలో జరుగుతున్న మత విద్వేశం మంచిది కానది అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కుచిత బుద్ధితో కుటిల రాజకీయాలు చేసి విధ్వంసాలు చేస్తున్నారని విమర్శించారు. మర పొరుగు రాష్ట్రం కర్ణాటక బెంగళూర్ లో 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉన్నాయని.. పరోక్షంగా మరో 30 లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. కర్ణాటకలో హిజాబ్, హలాల్ పేరుతో పూలు కొనవద్దని, పళ్లు కొనవద్దని విద్వేషాలు రగులుస్తున్నారని విమర్శించారు. విాదేశాల్లో 11 కోట్ల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు.. ఆయా దేశాలు మనల్ని వెళ్లగొడితే ఈ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా..? అని ప్రశ్నించారు. దేశం అన్ని రంగాల్లో నాశనం అయిందని.. పోయిన సర్కార్ మంచిగా ఉందని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జీడీపీ తగ్గింది, ఆకలి పెరిగింది, స్టీల్ ధరలు, సిమెంట్ ధరలు పెరిగాయని సామాన్యుడిపై భారం పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి మత పిచ్చి లేపి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొంతమంది చూస్తున్నారని విమర్శించాడు. పుల్వామా, కాశ్మీర్ ఫైల్స్, సర్జికల్ స్ట్రైక్స్ ఇలా మత పిచ్చి, విద్వేశాలు రేపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంత వాతావరణం ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version