ఆలేరు రూపు రేఖలే మారిపోయాయి : కేసీఆర్

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దూసుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు బాగా ఆలోచించి ఓటేయాలని, ఎవరికి పడితే వాళ్లకు కాకుండా మంచి, చెడు, న్యాయం, అన్యాయం గురించి ఆలోచించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది, ఏ పార్టీ రాష్ట్రాన్ని బాగు చేస్తది అనేది ప్రజలు ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అలేరులో కరువు తాండవం చేసిందని, రైతులు బోర్లు వేసి నీళ్లు పడక, నీళ్లు పడినా కరెంటు లేక ఎన్నో గోసలు పడ్డరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు గుర్తుచేశారు.

కరువులతో అల్లాడిన ఆలేరు నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని సీఎం చెప్పారు. లక్ష్మీ నర్సింహస్వామి ఆశీస్సులతో యాదరిగి గుట్ట పుణ్యక్షేత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నమని తెలిపారు. ఒకప్పుడు ఆలేరు భూములకు విలువ ఉండేది కాదని, ఇప్పుడు ఈ నియోజకవర్గానికి పెద్దపెద్ద షావుకారులు వచ్చి భుములు కొని పెట్టుకున్నరని అన్నారు. ఆలేరు రూపు రేఖలే మారిపోయాయని చెప్పారు. సునీతను మరోసారి గెలిపిస్తే ఆలేరులో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version