యువత జర భద్రంగా ఉండాలె.. విద్వేషాల జోలికి పోవద్దు : సీఎం కేసీఆర్

-

దేశంలో కొన్ని పార్టీలు విద్వేష రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. యువత చాలా అప్రమత్తంగా ఉండాలని.. విష ప్రచారాలకు.. విద్వేషాలకు లొంగకూడదని సూచించారు. కాస్త ఏమరపాటుగా ఉంటే బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో ఇప్పటికే చూశామని అన్నారు. ఏమరపాటుగా ఉన్నందు వల్లే.. చాలా ఏళ్లు సొంత రాష్ట్రంలో పరాయి వాళ్లుగా ఉండిపోయామని గుర్తు చేశారు.

వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతిమ మెడికల్ కళాశాలను, క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ దేశం సహనశీలత దేశమని, పోరాటాలకు వెనుకాడని దేశం భారత్ అని కేసీఆర్ కొనియాడారు. కొందరు దుర్మార్గులు వారి స్వార్థ, దుర్బుద్ధి రాజకీయాలతో విధ్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

శనివారం ఉదయం రోడ్డు మార్గంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ వరంగల్ చేరుకున్నారు. వరంగల్‌లో (ములుగు రోడ్డులో) నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఈ మెడికల్ కాలేజీ ద్వారా మెడికల్ స్టూడెంట్స్ కు ప్రతి ఏడాది 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version