కౌలు రైతులను మేం గుర్తించం – సీఎం కేసీఆర్

-

కౌలు రైతులను మేం గుర్తించమన మరోమారు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంట నష్టంపై శాసన సభలో జరిగిన చర్చలో భాగంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా రైతుబంధు విషయంలో కౌలు రైతులను గుర్తించమని ప్రభుత్వం పలుమార్లు తెలిపింది. రైతులకు ప్రైవేటు వ్యక్తికి జరిగే ఒప్పందంగా మాత్రమే కౌలును చూస్తామని వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే కౌలు ఇస్తరు అని తెలిపారు.

అందుకనే కౌలుదారుని కాలమ్ ను రికార్డుల నుంచి తొలగించినట్లుగా తెలిపారు. రైతులు, కౌలు రైతుల వారువారు చూసుకోవాలి తప్పితే ప్రభుత్వం పట్టించుకోదని అన్నారు. అసలు రైతులు నష్టపోవద్దనేది ప్రభుత్వం పాలసీ అని కుండబద్దలు కొట్టారు. రైతులు ఏళ్లకేళ్లు కాపాడుకుంటూ వచ్చే భూమిని కొంతమంది వ్యక్తులు, పైరవీకారులు తన్నుకుపోవద్దనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మరోమారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version