గులాబీ బాస్ ప్రచార షెడ్యూల్

-

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపుకి మరో ఆరు రోజులే ఉండటంతో అన్ని పార్టీలు నువ్వా..నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. కానీ తెరాస అధినేత కేసీఆర్ స్పీడుని మాత్రం అందులేకపోతున్నాయనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. అసెంబ్లీ రద్దు నాటి నుంచి నేటి వరకు దాదాపు 76 సభలకు పైగా హాజరైన గులాబీ బాస్ నేడు మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాశీర్వాద సభలతో తెరాస కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.

  • నేటి షెడ్యూలు..
    * ఉదయం 11.30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో ప్రచారం.
    * మధ్యాహ్నం 12.15 గంటలకు కొత్తగూడెంలో జరిగే సభల్లో పాల్గొంటారు.
    * మధ్యాహ్నం 1.00 గంటకు మణుగూరు చేరుకుంటారు.
    * మధ్యాహ్నం 1.45 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు
  • * మధ్యాహ్నం 2.30 టలకు భూపాలపల్లిలో జరిగే సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
    * మధ్యాహ్నం 3.15గంటలకు మంథని.
    *సాయంత్రం 4 టలకు పెద్దపల్లిలో జరిగే ప్రచార సభలకు కేసీఆర్ హజరుకానున్నారు.

ప్రతి రోజు కనీసం ఐదు సభలకు తక్కువకాకుండా కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహిస్తుండంతో ప్రతిపక్షాలకు ఏమీ చేయాలో తెలియక ఆకాశం వైపు చూస్తున్నారంటూ కొంత మంది నెటిజన్లు వ్యాగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version