ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి…అసలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే…ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్‌కు ఎక్కడకక్కడ చుక్కలు చూపిస్తూ వచ్చింది…పైగా ఇటీవల కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అస్త్రంగా దొరికాయి..దీంతో కేసీఆర్‌కు మరింత నెగిటివ్ పెరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనపై మోదీ మాట్లాడిన మాటలు…టీఆర్ఎస్‌కు అస్త్రంగా దొరికాయి. అసలు తెలంగాణ ఉద్యమాన్ని మోదీ అవమానిస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపే పనిలో ఉన్నాయి.
ఈ సభల్లో కేసీఆర్ పూర్తి టార్గెట్ బీజేపీ మాత్రమే..అసలు మోదీ వల్ల దేశం నాశనమైపోతుందనే కోణాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. అలాగే మోదీ తెలంగాణని కూడా నాశనం చేయాలని చూస్తున్నారని, మోటర్లకు మీటర్లు పెట్టి రైతులని ముంచాలని చూస్తున్నారని, అసలు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని కేసీఆర్ గట్టిగా చెప్పేస్తున్నారు. అలాగే తెలంగాణ సెంటిమెంట్‌ని కూడా మళ్ళీ లేపుతున్నారు.
బీజేపీ రూపంలో తెలంగాణకు కొత్త బూచి వస్తుందన్నట్లు ప్రచారం చేస్తున్నారు. పైగా అసోం సీఎం…రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలని కేసీఆర్ ఖండించి…కాంగ్రెస్ శ్రేణులని సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణకు బీజేపీనే శత్రువు అని చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఒక్కసారిగా తనపై వచ్చిన వ్యతిరేకతని పోగొట్టుకోవడానికి బీజేపీని బూచిగా చూపిస్తున్నారు…ఇక ఈ విషయంలో కేసీఆర్ కాస్త సక్సెస్ అయ్యేలా ఉన్నారు..ఆయన మాటల గారడీకి తెలంగాణ ప్రజలు మళ్ళీ లొంగితే…మళ్ళీ కేసీఆర్ విజయాన్ని ఆపడం కష్టమే.