సౌందర్య బయోపిక్… కీర్తి సురేష్ టైటిల్ రోల్…?

-

టాలీవుడ్ లో తక్కువ కాలంలో ఎన్నో మంచి సినిమాలు చేసిన హీరోయిన్ సౌందర్య. చాలా తక్కువ కాలంలో ఎక్కువ ఫాలోయింగ్ పెంచుకుంది ఆమె. వరుసగా ఆమె సినిమాలు చేస్తూ అగ్ర హీరోల సరసన కూడా అలరించింది. ఎందరో అగ్ర హీరోలు ఆమెతో సినిమా చేయడానికి ఎదురు చూస్తూ ఉండే వారు అప్పట్లో. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోలు చిరంజీవి, నాగార్జున, జగపతి బాబు, కృష్ణ.

వీళ్ళు ఎక్కువగా ఆమెతో సినిమాలు చేసారు. వెంకటేష్ తో ఆమె చేసిన సినిమాలు కూడా మంచి పేరు సంపాదించాయి. ఇప్పుడు ఆమె బయోపిక్ ని ప్లాన్ చేస్తున్నారు. ఆమె పాత్రలో కీర్తి సురేష్ నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. ఆమె కోసం ఇప్పటికే ఒక అగ్ర నిర్మాత ప్లాన్ చేసారని, దానికి కీర్తి అంగీకరించింది అంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మూడు సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు వచ్చే ఏడాది విడుదల అవుతాయి.

మహేష్ బాబు సహా పలువురు హీరోలతో ఆమె సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఇప్పుడు సౌందర్య బయోపిక్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీసే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని, సౌందర్య జీవితాన్ని ఆయన చాలా దగ్గరగా చూసారని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version