మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి కీర్తి సురేష్. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించడమే కాక ఆమెలో ఉన్న నటి అందరికీ పరిచయం అయింది. మన స్టార్స్‌లో చాలా మందికి కూడా కుక్క పిల్లలను పెంచుకునే అలవాటు ఉంది. కొందరు అయితే వాటిని ప్రాణంగా చూసుకుంటారు. అందులో కీర్తి సురేష్ కూడా ఒకరు. కీర్తి నైకీ అనే ఓ కుక్క పిల్లను పెంచుకుంటోంది.
ఇప్పటికే దానిని పలు సంద్భార్బాల్లో ప్రేక్షకులకు పరిచయం చేసిన కీర్తి ఇప్పుడు ఏకంగా దానికి సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. నిన్న దీపావళి సందర్భంగా చీర కట్టుకున్న ఆమె దానితో నైకీని టీజ్ చేస్తూ ఉన్న వీడియో పంచుకుంది. అలానే తన కొడుకు(నైకీ)ని సోషల్ మీడియాలోకి తెస్తున్నానని పేర్కొంది. అయితే మరో ఆసక్తికర అంశం ఏమిటంటే దానికి అప్పుడే 13.5 వేల మంది ఫాలోవర్స్ రావడం.