మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె అడపాదడపా సినిమాలు చేస్తోంది. కానీ సరైన బ్లాక్ బాస్టర్ హిట్ ఒకటి కూడా పడలేదని చెప్పడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే గ్లామర్ షో చేయాల్సిందే లేకపోతే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వడం కష్టమవుతుంది.. కానీ ఎంతో పద్ధతిగా ఉంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ గ్లామర్ షో కి దూరంగా ఉంటూ వచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రస్తుతం మహానటి సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది.
చాలా కాలం సాంప్రదాయ పద్ధతిగా ఉంటుంది అని పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ కూడా తన రూటు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ గా ఆలోచించడమే కాకుండా హీరోయిన్లతో పోటీ పడుతూ ఎక్స్పోజ్ చేయడంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. అయితే ఇలా ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ ప్రస్తుతం గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతోంది కీర్తి సురేష్.మరీ ముఖ్యంగా సర్కారు వారి పాట సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచింది మొదటిసారి తన హద్దులను చెరిపేసి మాస్, గ్లామర్ టచ్ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్య పోయారు. ఇకపోతే తాజాగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల మీకు కాస్టింగ్ కౌచ్ ఎదురయిందా? ఒకవేళ కమిట్మెంట్ ఇస్తేనే మీరు హీరోయిన్ అవుతారు అంటే.. మీ సమాధానం ఏంటి? అంటూ కీర్తి సురేష్ కి ప్రశ్న ఎదురవగా.. అవసరమైతే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటాను కానీ ఆ పని మాత్రం చేయను అంటూ ముఖం మీద చెప్పేసింది. అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం నాకు తెలుసు.. నాతోపాటు నటిస్తున్న చాలామంది హీరోయిన్లు ఈ విషయం నాతో చెప్పారు. కానీ మనం బిహేవ్ చేసే పద్ధతిని బట్టి అన్నీ ఉంటాయి అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.