స‌ర్కారువారి పాటలో కీర్తి సురేశ్ పాత్ర‌నే హైలెట్‌.. మామూలుగా ఉండ‌దు!

-

మ‌హాన‌టి సినిమాతో సినీ ప్ర‌పంచంలో తాను మ‌హాన‌టిని అని నిరూపించుకుంది కీర్తి సురేశ్‌. ఎక్క‌డా గ్లామ‌ర్ డోస్ లేకుండా కేవ‌లం కంటెంట్ ఉన్న పాత్ర‌ల‌నే చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. టాలీవుడ్‌, కోలీవుడ్ లో అగ్ర హీరోల‌తో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ప‌క్క‌న న‌టిస్తోంది ఈ క్యూటీ.

ఇప్పుడు ఈమె క్యారెక్ట‌ర్ గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త ఫిల్మ్ న‌గ‌ర్‌లో చెక్క‌ర్లు కొడుతోంది. ఈమె పాత్ర‌నే సినిమాల‌కు హైలెట్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి అంత ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ అంటే అది కీర్తిసురేశ్‌కు ద‌క్కాలి అందుకే ఆమె చేస్తోంది.

ప‌ర‌శురాం డైరెక్ష‌నో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ పాత్ర టైమ్ ఎక్కువ‌గా ఉంటుందంట‌. ఓ బ్యాంక్ స్కామ్ ను ఛేజ్‌చేసే క‌థాంశంలో ఈమె మ‌హేశ్‌బాబు కింద ఉద్యోగినిగా ప‌నిచేయనుంది. బ్యాంకులో జ‌రిగే మోసాల‌ను ఈమె మ‌హేశ్‌కు వివ‌రించే సీన్లు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయ‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రూ క‌లిసి శ‌త్రువుల ఆట క‌ట్టిస్తార‌ని తెలుస్తోంది. ఎంతైనా కీర్తికి ట్యాలెంటెడ్ పాత్ర‌లే వ‌స్తున్నాయి క‌దా. ఇక ఈ మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version